మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి అపార సంపద, విలాసవంతమైన జీవనం గురించి తెలుసుకోండి. రోజుకు లక్ష డాలర్లకు పైగా సంపాదించే మెస్సికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కోట్లు వస్తాయి. $15 మిలియన్ల విలువైన అతడి ప్రైవేట్ జెట్ (గల్ఫ్‌స్ట్రీమ్ V) లో కుటుంబ పేర్లు, నంబర్ 10 వంటి వ్యక్తిగత స్పర్శలు ఉన్నాయి. ఈ జెట్ అతడి ప్రయాణాలను సులభతరం చేస్తుంది.
లియోనల్ మెస్సి.. ఈ పేరు వింటే సాకర్ ప్రపంచం పూనకాలతో ఊగిపోతుంది. అతడి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అతడిని అభిమానిస్తుంటారు. మైదానంలో చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తుంటాడు. దిగ్గజాలకే దిగ్గజంగా పేరు గడించాడు. మెస్సీ రోజుకు ఏకంగా లక్ష డాలర్లకు పైనే సంపాదిస్తాడట.ముఖ్యంగా బ్రాండ్ ప్రకటనల ద్వారానే మెస్సీకి కోట్లు వస్తాయి. క్రిస్టియానో రొనాల్డో, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులకు అందనంత ఎత్తులో నిలిచాడు. మెస్సీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించిన మెస్సీ.. ఆమెనే వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మెస్సీ భార్య పేరు ఆంటోనెల్లా రోకజో. ఇక.. మెస్సీ ఆస్తుల విషయానికి వస్తే.. మనోడికి అర్జెంటీనాలోని నో ఫ్లై జోన్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఎన్నో లగ్జరీ ఇళ్లు ఓ ప్రైవేట్ జెట్, హోటళ్లు అతడి సొంతం. మెస్సీ వద్ద 15 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ. 125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V విమానం కూడా ఉంది. 2004లో తయారైన ఈ జెట్‌ను మెస్సీ 2018లో కొనుగోలు చేశాడు.ఈ విమానంలో మెస్సీ వ్యక్తిగత అభిరుచులు స్పష్టంగా కనిపిస్తాయి. జెట్ తోక భాగంలో ఆయనకు ఎంతో ఇష్టమైన “10”వ నంబర్ ముద్రించి ఉంటుంది. అలాగే విమానం మెట్లపై తన భార్య ఆంటోనెలా, ముగ్గురు పిల్లలు థియాగో, మాటియో, సిరో పేర్లను రాయించాడు. ఈ జెట్ సుదూర ప్రయాణాలకు అత్యంత అనుకూలం. ఈ జెట్‌లో పూర్తిస్థాయి కిచెన్, రెండు బాత్రూమ్‌లతో పాటు 16 సీట్లు ఉన్నాయి. అవసరమైతే ఈ సీట్లను 8 బెడ్లుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల సుదూర ప్రయాణాల్లో ఆటగాళ్లు, సిబ్బంది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. క్లబ్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం తరచూ ఖండాలు దాటి ప్రయాణించే మెస్సీకి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడుతుంది. గల్ఫ్‌స్ట్రీమ్ V మోడల్ జెట్, శక్తివంతమైన రోల్స్ రాయిస్ ఇంజిన్లతో నడస్తుంది. అద్భుత పనితీరు, భద్రతకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ విమానాన్నే వినియోగిస్తుంటారు. దీనికంటే ముందు కూడా మెస్సీ దాదాపు 35 మిలియన్ డాలర్ల విలువైన ఎంబ్రేయర్ లెగసీ 650 అనే మరో జెట్‌ను ఉపయోగించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

