ఏజెన్సీలో కలకలం.. ఓ ఇంట్లో తలదాచుకున్న మావోయిస్టులు.. పోలీసుల అదుపులో టాప్ లీడర్..!
కొమురంభీం జిల్లా సిర్పూర్ యు అడవుల్లో కలకలం రేగింది. సిర్పూర్ (యు) లోని ఓ ఇంటిలో తలదాచుకున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంకలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన 16 మంది మావోయిస్టులు షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రాణహిత మీదుగా కొమురంభీం జిల్లాలోకి చేరుకున్నారని సమాచారం.

కొమురంభీం జిల్లా సిర్పూర్ యు అడవుల్లో కలకలం రేగింది. సిర్పూర్ (యు) లోని ఓ ఇంటిలో తలదాచుకున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంకలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన 16 మంది మావోయిస్టులు షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రాణహిత మీదుగా కొమురంభీం జిల్లాలోకి చేరుకున్నారు. సిర్పూర్ (యు) లోని ఓ ఇంట్లో తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొమురం భీం జిల్లా ఏఎస్‌పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వారి స్థావరాలను మారుస్తూ కొమురంభీం జిల్లాకు చేరుకున్నారని తెలుస్తోంది. పోలీస్ నిఘా విభాగం సమాచారంతో ఏఎస్పీ చిత్తారంజన్, స్పెషల్ పార్టీ పోలీసులు సిర్పూర్ యు అడవుల్లో కూబింగ్ నిర్వహిస్తుండగా, సోమవారం రాత్రి మావోయిస్టు స్థావరం కనిపెట్టారు. చాకచక్యంగా వ్యవహరించిన భద్రతా దళాలు మావోయిస్టులను పట్టుకోవడంలో సఫలీకృతం అయ్యారు.
పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు ఉండగా 7 పురుషులు ఉన్నట్లు తెలిస్తోంది. ఇందులో డిస్ట్రిక్ట్ కమాండెంట్ మెంబర్స్ నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుపడ్డ వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా పోలీసులు మాత్రం మావోయిస్టుల అరెస్ట్‌పై అదికారిక ప్రకటన విడుదల చేయలేదు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




