AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు

అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 1:08 PM

Share

వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ స్టార్ జోడీ దీపికా పడుకొనే, రణ్‌వీర్ సింగ్‌లతో విభేదాలు బయటపడ్డాయి. 'స్పిరిట్' కోసం దీపికాను ఎంపిక చేసి ఆమె షరతులతో తొలగించడం, గతంలో రణ్‌వీర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ ఆఫర్‌ను తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వరుస ఘటనలతో నెటిజన్లు 'స్టార్ జోడీ చేతిలో దెబ్బతిన్న సందీప్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో వైల్డ్ డైరెక్టర్‌గా ట్యాగ్ ఉంది సందీప్ రెడ్డి వంగాకి. ఓ సీన్‌ను ఇంటెన్సివ్‌గా.. వయోలెంట్ మిక్స్ చేసి చెప్పడమే కాదు.. స్క్రీన్ ప్లే తోనూ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తుంటాడు ఈ డైరెక్టర్. అలాంటి ఈ డైరెక్టర్‌కు బాలీవుడ్ స్టార్ జోడీతో.. ఎప్పటి నుంచో పడడం లేదనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. ఎట్ ప్రజెంట్.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. ఈసినిమా కోసం మొదట దీపికను హీరోయిన్‌గా తీసుకోవలనుకున్నాడు. తీరా స్టోరీ నరేట్ చేశాక.. తను పెట్టిన కండీషన్స్ చూసి.. దీపినను తన సినిమా నుంచి తీప్పించాడు. దీంతో హర్ట్‌ అయిన దీపిక సందీప్‌ తీరుపై మీడియాకెక్కింది. సందీప్‌ను విమర్శించి సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయింది. సందీప్ వంగా కూడా దీపిక విమర్శలను తిప్పికొడుతూ బీటౌన్‌లో గట్టిగానే నిలబడ్డాడు. ఇక ఈక్రమంలోనే ఇప్పుడు మరో విషయం బయటికి వచ్చింది. దీపిక భర్త రణ్‌ వీర్ సింగ్‌ కూడా గతంలో సందీప్ రెడ్డి వంగాకు హ్యాండిచ్చినట్టుగా ఆ విషయాన్ని బట్టి తెలుస్తోంది. తన డైరెక్టోరియల్ డెబ్యూ.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో తెరకెక్కిద్దామనుకున్న వంగా.. అందుకోసం హీరోగా మొదట రణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకున్నాడట. కానీ రణ్‌వీర్ సింగ్ సందీప్ రెడ్డి వంగా ఆఫర్ ను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేశాడట. దాంతో షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్ సినిమా ఫినిష్ చేసి హిట్టు కొట్టాడు. కానీ అప్పట్లో రణ్వీర్ సందీప్ రెడ్డి వంగాను రిజెక్ట్ చేయడం.. ఇటీవల దీపిక సందీప్ తీరును విమర్శించడం .. ఈ రెండిండిని క్యాచ్ చేసిన కొంత మంది నెటిజన్లు.. ఈ స్టార్ జోడీ చేతిలో దెబ్బతిన్న సందీప్ అంటూ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు మీవెంటే !!

ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!

పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..

ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే

ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు