ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఓ యువకుడు బోగీల మధ్య ప్రమాదకరంగా ప్రయాణించి హల్చల్ సృష్టించాడు. మంచిర్యాల స్టేషన్‌లో రైలు ఆపినప్పుడు హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. రైల్వే పోలీసులు అతడిని కాపాడి విచారించగా, మానసిక ఆరోగ్య సమస్యలున్నాయని తేలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు, పోలీసులు కుటుంబాన్ని పిలిపించి యువకుడిని అప్పగించారు.
గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఎక్కడా చోటు లేనట్టు రెండు బోగీలమధ్య పడుకొని ప్రయాణం చేశాడు. తీరా రైల్వే స్టేషనుకు రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ ఆగడమే ఆలస్యం ఆ యువకుడు చేసిన పనికి అంతా షాకయ్యారు. పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మంచిర్యాల జిల్లా రైల్వేస్టేషన్‌లో గోరఖ్ పూర్ ట్రైన్ ఎక్కిన జయశంకర్ అనే వ్యక్తి రైలు రెండు బోగీల మధ్య ఏసీ పైపుల పైన కూర్చొని ప్రయాణం చేశాడు. మంచిర్యాల రైల్వే స్టేషను రాగానే కొందరు ప్రయాణికులు అతడిని గుర్తించి కేకలు వేయడంతో ట్రైన్‌ను నిలిపివేశారు. విషయం తెలిసి ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. ట్రైన్ పైకి ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ యువకుడికి నచ్చ చెప్పి కిందకు దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆధార్ ఆధారంగా ఆ యువకుడిది మెదక్ జిల్లాలోని బూరుగుపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో అతనికి గత కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆ యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి పిలిపించి, యువకుడిని వారికి అప్పగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

