ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, నాలుగు నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తన కొడుకును చూసి ఓ తల్లి ఆనందం ఉప్పొంగింది. ఆమె కొడుకుకు పేపర్ పూలతో సర్ ప్రైజ్ చేసి, భావోద్వేగంతో కౌగిలించుకుంది. ఈ హృదయాన్ని కదిలించే దృశ్యం తల్లి ప్రేమ స్వచ్ఛతను చాటిచెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంది. కోట్లాది వీక్షణలతో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
సోషల్ మీడియా ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా మారుతోంది. అదే సమయంలో భావోద్వేగపూరితమైన దృశ్యాలు కూడా కనిపిస్తుంటాయి. తాజాగా, ఓ మహిళ తన కొడుకు నాలుగు నెలల తర్వాత ఇంటికి తిరిగి రావడాన్ని పండగగా జరుపుకుంటుంది. అతనిపై పేపర్ పూలు చల్లుతూ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. దీంతో ప్రపంచంలో తల్లి ప్రేమే అత్యంత స్వచ్ఛమైనదంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో విద్యార్థిగా ఉన్న తన కొడుకు నాలుగు నెలల తర్వాత ఇంటికి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కొడుకు రాక కోసం ఆమె సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆమె తలుపు పక్కనే ఉండి పార్టీ పాపర్‌తో.. తన కొడుకు లోపలికి రాగానే పూల వర్షం కురిపిస్తుంది. కొడుకును చూసిన ఆ తల్లి ఆనందంతో ఎగిరిగంతేస్తుంది. అనంతరం తన కొడుకును ఎంతో అప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. కొడుకు కూడా తల్లిని ప్రేమ పూర్వకంగా కౌగలించుకుంటాడు. ఇద్దరూ భావోద్వేగానికి గురవుతారు. ఇద్దరినీ చూసి తండ్రి కూడా కొంత భావోద్వేగానికి గురవుతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ భావోద్వేగపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చింది. అనేక మంది తల్లి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హృదయాన్ని కదిలించే దృశ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 30 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 2 మిలియన్లమందికి పైగా లైక్ చేశారు. 17000 మంది కామెంట్ల రూపంలో స్పందించారు. తల్లి ప్రేమ బయటికి కనిపిస్తుంది కానీ, తండ్రి కుటుంబాన్ని సంతోషాని పునాది అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కొడుకు తన తండ్రిని కూడా కౌగిలించుకోవాలని మరో నెటిజన్ అన్నారు. అతను కూడా కొడుకు కోసం వేచి చూశాడని చెప్పారు. తల్లి ప్రేమ ప్రపంచంలోనే స్వచ్ఛమైనదని మరో నెటిజన్ ప్రశంసించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

