పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
చైనాలో ఓ వ్యక్తి పెంచుకున్న విషపూరిత పాము కాటుతో వేలు కోల్పోయాడు. జబ్బుపడ్డ పాముకు ఆహారం పెడుతుండగా ఇది జరిగింది. "ఫైవ్-స్టెప్ స్నేక్"గా పిలువబడే ఆ సర్పం విషం వేలుకు పాకి ప్రాణాపాయం తెచ్చిపెట్టింది. ప్రమాదకర పెంపుడు జంతువుల పెంపకం ఎంత ప్రమాదమో ఈ ఘటన రుజువు చేస్తుంది. ఇలాంటి జంతువులతో వైరస్‌ల వ్యాప్తి ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాముల సహజ గుణం కాటు వేయడం. అన్ని పాముల్లో విషం ఉండదు కొన్ని మాత్రమే విషపూరితం. మనం పెంచుకునేది విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే. అదే జరిగింది చైనాలో. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు . బీజింగ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. హువాంగ్‌కు చిన్నప్పట్నుంచి పాములంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోయింది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒక రోజు ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటు బారిన పడ్డ హువాంగ్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. విషపూరిత పాముకి దూరంగా ఉండటం ఎంత మంచిదో అతనికి తెలిసొచ్చింది. చైనీస్ కథల్లో ఈ పామును “ఫైవ్ స్టెప్ స్నేక్” అని పిలుస్తారు. ఇది ఎంతో విషపూరితమైందనే నమ్మకం ఉంది. ఇది కాటువేస్తే ఆ వ్యక్తి ఐదుడుగులు కూడా వేయకముందే తీవ్ర నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావంతో మరణిస్తారని చెబుతారు. ఆ పాము శాస్త్రీయ నామం long nosed రస్సెల్స్ వైపర్. చైనాలో అరుదైన ప్రమాదకర జంతువులను పెట్స్‌గా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. వాటి వల్ల మనుషులు ప్రమాదకర వైరస్‌ల బారిన పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

