ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు మీవెంటే !!
మానవ జీవితంలో మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. క్రాసులా జేడ్ మొక్క అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది సాధారణ మనీ ప్లాంట్ కంటే శక్తివంతమైనదిగా వాస్తు, ఫెంగ్ షుయ్ సూచిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, సానుకూల శక్తి, శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లో ఈ మొక్కను పెంచడం ద్వారా సిరిసంపదలు వస్తాయి.
మానవ జీవితంలో మొక్కలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మొక్కలు మానవులకు ప్రాణవాయువును అందించడమే కాదు.. అదృష్టాన్నీ, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి. అంటే కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం వల్ల అదృష్టాన్ని, సంపదను తెస్తాయని, సానుకూల మార్పులు వస్తాయని చెబుతారు. చాలా మంది మనీ ప్లాంట్‌ను తమ నివాసాల్లో పెంచుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మొక్క నాటడం వల్ల సంపద వస్తుందని భావిస్తారు.అయితే, మనీ ప్లాంట్‌ను మించి ప్రత్యేకమైన పవిత్రమైనదిగా భావించే మొక్క కూడా ఒకటి ఉంది. ఆ మొక్కను నివాసంలో నాటుకుని పెంచుకుంటే సానుకూల వాతావరణంతోపాటు ఇంటిలోకి సిరిసంపదలు వస్తాయని నమ్ముతారు. ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మొక్క పేరే క్రాసులా జేడ్. దీన్ని ఒక ప్రత్యేక శక్తివంతమైన మనీ ప్లాంట్‌గా పరిగణిస్తారు. చైనీస్ వాస్తు శాస్త్రం లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది సాధారణ మనీ ప్లాంట్ కంటే కూడా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో క్రాసులా మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయని నమ్ముతారు. అంతేగాక, ఈ మొక్క కొత్త ఆదాయ మార్గాలను తెరవడానికి, సానుకూల శక్తి, శ్రేయస్సును పెంచేందుకు సహాయ పడుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీ ఇంట్లో ఈ మొక్కను నాటడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసులా మొక్కను నాటడం వల్ల మీ ఉద్యోగం, వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా.. ఇంట్లో శక్తి సమతుల్యతను కాపాడుతుంది. ఇది వ్యాపారవేత్తలకు శుభప్రదంగా పరిగణిస్తారు. క్రాసులా మొక్కను ప్రధాన ద్వారం కుడివైపున ఉంచాలి. క్రాసులా మొక్కను నివాసంలో నాటడం వల్ల సంపద వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ మొక్కకు అధికంగా నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, దీని ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. తగినంత సూర్య కాంతిని ఈ మొక్కకు తగిలేలా చూసుకోవాలి. ఇంట్లో మొక్కలు ఉండటం పర్యావరణాన్ని శుద్ధి చేయడంతోపాటు మానసిక సమతుల్యతను కాపాడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

