Telangana: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారిందోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. హోలీ పండుగ కారణంగా మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A/బోటనీ/పొలిటికల్ సైన్స్ పరీక్షను మార్చి 4కు వాయిదా వేశారు. మిగతా అన్ని పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న మెయిన్ ఎగ్జామ్స్‌కు సంబంధించి.. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2బి, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ ఎగ్జామ్‌ను మార్చి 3వ తేదీకి బదులుగా మార్చి 4వ తేదీ నిర్వహించనున్నట్లు బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మూడో తేదీన హోలీ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో పరీక్షను ఒకరోజు వాయిదా వేసినట్లు ప్రకటించింది. మిగిలిన పరీక్షల షెడ్యూల్ యధావిధిగా ఉన్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పూర్తి షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం పదండి…
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:
- ఫిబ్రవరి 25న సెకెండ్ లాంగ్వేజ్
- ఫిబ్రవరి 27 న ఇంగ్లీష్
- మార్చి 2 – మ్యాథమెటిక్స్ 1A/ బోటని/ పొలిటికల్ సైన్స్
- మార్చి 5 – మ్యాథమెటిక్స్ 1B / జూలజీ / హిస్టరీ
- మార్చి 9 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
- మార్చి 12 – కెమిస్ట్రీ / కామర్స్
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యుల్:
- ఫిబ్రవరి 26న సెకెండ్ లాంగ్వేజ్
- ఫిబ్రవరి 28న ఇంగ్లీష్
- మార్చి 4- మ్యాథమెటిక్స్ 2A/ బోటని/ పొలిటికల్ సైన్స్
- మార్చి 6 – మ్యాథమెటిక్స్ 2B / జూలజీ / హిస్టరీ
- మార్చి 10 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
- మార్చి 13 – కెమిస్ట్రీ / కామర్స్
షెడ్యూల్ ప్రకారమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2 నుంచి ఒకటి వరకు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3 న అధికారిక హోలీ హాలిడే ఇవ్వడంతో ఎగ్జామ్ షెడ్యుల్ స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ముఖ్యంగా షెడ్యుల్‌లో మార్పులను ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు గమనించాలని బోర్డు సూచించింది.
Revised schedule of Telangana Inter exmas #Telangana pic.twitter.com/eXycpGrbzI
— Janardhan Veluru (@JanaVeluru) December 16, 2025




