ఇండిపెండెంట్ అభ్యర్థి అర్జున్ పై హత్య యత్నం
వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండలో స్వతంత్ర అభ్యర్థి అర్జున్‌పై కత్తితో హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా, అర్జున్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. దోమ మండలం రాకొండ గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో అర్జున్ పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల బలమైన గాయాలయ్యాయి. ముసుగు వేసుకుని వచ్చిన దుండగుడు దాడి చేసి పారిపోయినట్లు అర్జున్ వెల్లడించారు. వెంటనే ఆయనను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి అర్జున్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామంలోని యువకులు అర్జున్‌ను ప్రోత్సహించి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కావాలనే ఈ దాడి చేశారని అర్జున్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ వెర్రి.. వీసా వర్రీ.. కఠిన నిబంధనలు గురించి తప్పక తెలుసుకొండి
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధరలు
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

