Hyderabad: ఛీ..ఛీ.. నారాయణగూడలో కూరగాయల వ్యాపారి చండాలం.. అక్కడ చేతులు పెడుతూ
హైదరాబాద్ నారాయణగూడలో మేల్కొటి పార్కు ముందు కూరగాయలు విక్రయించే మహ్మద్ వాసీక్ ప్రవర్తన అత్యంత చెండాలంగా ఉంది. తన ప్రైవేట్ భాగాలను చేతులతో తాకి, అదే చేతులతో కూరగాయలను ముట్టుకున్న దృశ్యాన్ని స్థానికులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు అతనిపై పెట్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ నారాయణగూడలో కూరగాయల వ్యాపారి చండాలమైన పనిచేశాడు. కనీస శుభ్రత పాటించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడు వ్యాపారి మహ్మద్ వాసిక్. తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకి.. అదే చేతులతో మళ్లీ కూరగాయలు ముట్టుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. పలుమార్లు అలాగే చేస్తూ ఇటీవల సెల్‌ఫోన్ కెమెరాకి చిక్కాడు. గతంలోనూ ఇతని ప్రవర్తనపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుతం ఇతని దారుణమైన చేష్టల వీడియో వైరల్‌గా మారింది. విషయం పోలీసుల వరకూ వెళ్లేసరికి వీడియోను పరిశీలించి వాసిక్‌ను అరెస్టు చేశారు. కోర్టు ఇతనికి 5 రోజుల జైలు శిక్ష వేసింది. 2,500 జరిమానా విధించింది. ఈ ఘటన తర్వాత నారాయణగూడ మెల్కోటే పార్క్ దగ్గరున్న కూరగాయల దుకాణాల్ని స్థానిక అధికారులు తీయించేశారు.
