Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి అడ్డుగా అమీర్ ఖాన్
సౌత్ స్టార్ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'మేరే రహో' విడుదల పలుమార్లు వాయిదా పడుతోంది. నిర్మాత అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్‌ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది సాయి పల్లవి అభిమానులను, స్వయంగా ఆమెను కూడా నిరాశపరుస్తోంది. ఈ ఆలస్యం వెనుక అసలు కారణం ఏమిటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
సౌత్‌లో పవర్ స్టార్ రేంజ్ స్టార్ డమ్ సంపాదించుకున్న సాయి పల్లవి.. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు కష్టపడుతోంది. అక్కడ కూడా సక్సెస్ కొట్టాలని తాపత్రయ పడుతోంది. ఈక్రమంలోనే బాలీవుడ్‌లో మేరే రహో సినిమాను ఫినిష్ చేసింది. కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ మాటి మాటికి పోస్ట్ పోన్ అవుతుండడం.. అందుకు అమీర్ ఖాన్ కారణం అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్ స్టార్ అయిన అమీర్ .. తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఈ మధ్య బిజీగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా… ‘మేరే రహో’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ… ప్రొడ్యూసర్ అమీర్ ఖాన్ మాత్రం తన కొడుకు మూవీ రిలీజ్ డేట్‌ను మారుస్తున్నాడు. నిజానికి ‘మేరే రహో’ మూవీ 2025 మిడిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దాన్ని. అప్పట్లో2025 డిసెంబర్‌కు మార్చాడు అమీర్. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మూవీ రిలీజ్‌ను 2026 సమ్మర్‌కి పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడట ఈ స్టార్ హీరో. తన నిర్ణయానికి కారణం మూవీ బిజినెస్ లెక్కలంటూ చెబుతున్నాడట. కాని రీజన్స్ ఏవైనా… సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇలా పలుమార్లు వాయిదా పడడం మాత్రం ఆమె ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అంతేకాదు ఆమెకు కూడా నచ్చడం లేదని ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు మీవెంటే !!
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఓర్నీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. వాస్తవం ఇదే
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు..
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి..
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు

