రాజస్థాన్లోని కోటాలో ఓ దొంగతనం ఘటనలో విచిత్రం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ ఓ దొంగ ఎగ్జాస్ట్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు తిరిగి రాగానే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను సురక్షితంగా బయటకు తీశారు. పట్టుబడిన నిందితుడు పవన్, ఓ పోలీస్ అధికారి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ విచిత్ర ఘటన కోటాలో చర్చనీయాంశమైంది.