మెదక్ జిల్లాకు చెందిన పోచయ్య అనే రైతు తన మామిడి తోటలో మద్యం సేవించి సీసాలు పగలగొడుతున్న తాగుబోతుల సమస్యతో విసిగిపోయాడు. కాళ్లకు గాయాలై ఆసుపత్రుల పాలైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దీనికి పరిష్కారంగా, తోటలో మద్యం తాగితే 25 చెప్పుదెబ్బలు, రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ వినూత్న చర్యతో తోటలో మందుబాబుల తాకిడి తగ్గింది.