AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి ప్రయాణీకులారా ఊపిరి పీల్చుకోండి.! TGSRTC సూపర్ గుడ్‌న్యూస్ ఇదిగో..

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే ప్రయాణీకులు బంపర్ న్యూస్.. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చేస్తున్నాయ్. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులు నడవనున్నాయి. ఆ బస్సుల వివరాలు.. రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు ఒకట్రెండు రోజుల్లో బయటకు రానున్నాయి. ఆ వివరాలు ఏంటి.

సంక్రాంతి ప్రయాణీకులారా ఊపిరి పీల్చుకోండి.! TGSRTC సూపర్ గుడ్‌న్యూస్ ఇదిగో..
Tgsrtc
Ravi Kiran
|

Updated on: Jan 06, 2026 | 9:05 AM

Share

సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా.? మీకోసమే టీజీఎస్ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ తీసుకోచ్చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు ఏకంగా 5 వేలకుపైగా స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2500 బస్సులు.. ఏపీకి 3 వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది ఆర్టీసీ. జనవరి 9వ తేదీ నుంచి సొంతూరుకు వెళ్లే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అటు ముందస్తు రిజర్వేషన్ల దృష్ట్యా పెద్ద ఎత్తున బస్సులను అందుబాటులో ఉంచనుంది TGSRTC.

అటు ఏపీఎస్ఆర్టీసీ విషయానికొస్తే.. సంక్రాంతికి జనవరి 8 నుంచి 14 వరకు 596 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ బస్సులు జనవరి 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో 150 బస్సులను పెంచేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా, తెలంగాణలో ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్‌కు ఈనెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..