Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..
త్వరలో సంక్రాంతి వస్తుండటంతో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గృహలక్ష్మి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించాలి.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ది పొందినవారి కోసం మరో అవకాశం కల్పిస్తోంది. వీరిని పథకంలో చేర్చేందుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ప్రతీ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజా పాలన అధికారులను నియమించింది. వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో చేర్చుతారు. గతంలో కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొర్లడంతో పథకాలకు అర్హత సాధించలేకపోయారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డు వచ్చినవారు ప్రభుత్వ పథకాలను అర్హత సాధిస్తారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందినవారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీవో ఆఫీసులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపల్ వార్డుల్లో కూడా ప్రజా పాలన అధికారులను నియమించింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకోనివారితో పాటు గతంలో తప్పుల వల్ల లబ్ది పొందనివారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం కోసం ఆధార్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాలి. ఇక మహాలక్షి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రూ.200 యూనిట్లలోపు కరెంట్ వాడేవారికి జీరో బిల్లు జారీ చేస్తుండగా.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు నేరుగా అకౌంట్లో నిధులు జమ చేస్తోంది.
