AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ ఎంపీ సీటుపై కన్నేసిన కాంగ్రెస్.. బలమైన ప్రత్యర్థులను ఢీ కొడుతుందా..

కరీంనగర్ పార్లమెంట్ సీటు గెలవడం మంత్రి పొన్నం ప్రభాకర్‎కు అత్యంత కీలకం. అయితే.. ఇక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ కూడా ఓటింగ్ శాతం పెంచుకుంది. ఇన్ని సవాళ్ళను ఆధిగమించి కాంగ్రెస్ ముందుకు వెళ్లే ప్లాన్ చేస్తుంది. ఈ నియోజకవర్గం ఇంచార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.. ఇక్కడి నుంచి ఎంపిగా కేసిఆర్ పోటీ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

Telangana: ఈ ఎంపీ సీటుపై కన్నేసిన కాంగ్రెస్.. బలమైన ప్రత్యర్థులను ఢీ కొడుతుందా..
Congress Party
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 17, 2024 | 12:38 PM

Share

కరీంనగర్ పార్లమెంట్ సీటు గెలవడం మంత్రి పొన్నం ప్రభాకర్‎కు అత్యంత కీలకం. అయితే.. ఇక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ కూడా ఓటింగ్ శాతం పెంచుకుంది. ఇన్ని సవాళ్ళను ఆధిగమించి కాంగ్రెస్ ముందుకు వెళ్లే ప్లాన్ చేస్తుంది. ఈ నియోజకవర్గం ఇంచార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.. ఇక్కడి నుంచి ఎంపిగా కేసిఆర్ పోటీ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంతేకాదు.. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్‎ను ఆదరించారు. 2019 ఎన్నికల్లో మాత్రం బిజెపి గట్టి షాక్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సంజయ్ విజయం సాధించారు. తరువాత బీఆర్ఎస్ బలహీనపడుతూ వచ్చింది. మొన్న జరిగిన ఆ సెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోల్పోయింది. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‎కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదేవిధంగా.. బిజెపి ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది.

ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్.. బిఆర్ఎస్ నుంచి వినోద్ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో స్పష్టత లేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానికి పరిమితమైంది. ఇప్పడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ సీటుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే, కాంగ్రెస్ నేతలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. అయితే.. బలమైన అభ్యర్థి కోసం దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినబడుతున్నాయి. ఇక్కడ బిజెపి – బిఆర్ఎస్‎ను ఎదురుకోవాలంటే.. బలమైన నేత కావాలి. అంతేకాకుండా.. బండి సంజయ్ దూకుడుగా వెళ్తున్నారు.

ఇప్పటికే ఎన్నికల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినోద్ కూడా ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కరీంనగర్ ఎంపీ స్థానం.. ఇటు నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ అసెంబ్లీ స్థానంపై మరింత దృష్టి పెడుతున్నారు. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మొదటి స్థానంలోకి తీసుకోవరావడంపై దృష్టి పెట్టారు. కరీంనగర్ అసెంబ్లీలో సుమారు 3 లక్షల 50 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‎లో కాంగ్రెస్‎కి కేవలం 40 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఎంపీ నియోజకవర్గం బాధ్యతలు పొన్నం తీసుకున్నారు. ఆయన మంత్రి అయిన తరువాత మొదటి ఎన్నికలు ఇవి. అంతే కాదు ఇక్కడ రెండు పార్టీలు బలంగా ఉండటంతో పొన్నం మరింత దృష్టి పెట్టారు. ఇప్పటికే సంజయ్, వినోద్‎పై విమర్శలు చేస్తున్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. దూకుడుగా ఉండే పొన్నం ఈ సీట్‎పై పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించడం తప్పనిసరిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..