బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గను.. కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గను.. కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

Ravi Kiran

|

Updated on: Mar 16, 2024 | 9:49 PM

బీఎస్‌పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు నచ్చని బీజేపీ.. ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేసిందని ఆరోపించారు. భవిష్యత్‌లో కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానన్నారు.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత నందినగర్‌ నివాసంలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. BRS, బీఎస్పీ పొత్తు లేకుండా BJP ఒత్తిడి తీసుకొచ్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించరాదన్నదే తన అభిమతమన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు లౌకిక కూటమి ఏర్పాటు చేస్తే తనపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.

BRSతో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టాలని ఆదేశించారన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని.. అందరితో చర్చించాకే రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానన్నారు. భవిష్యత్‌లో కేసీఆర్‌తో కలిసి నడుస్తానన్నారు. 10 రోజుల కిత్రమే బీఆర్ఎస్ – బీఎస్పీ క‌లిసి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని డిసైడ్‌ అయ్యాయి. పొత్తులో భాగంగా హైద‌రాబాద్, నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను బీఎస్సీకి కేటాయించారు కేసీఆర్‌. కానీ సడెన్‌గా BSPకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేయడం ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది.

Published on: Mar 16, 2024 09:49 PM