దేశ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కన్హా శాంతివనం: జగదీప్ ధన్‌ఖర్

ప్రపంచశాంతి కోసం దేశ, విదేశాల నుండి ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వందలాదిగా తరలిరావడంతో కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని హిందూ, బౌద్ధ, జైన, సిక్కు సంప్రదాయల అధ్యాత్మిక గురువులు ఈ మహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కన్హా శాంతివనం: జగదీప్ ధన్‌ఖర్
Jagdeep Dhankar
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 16, 2024 | 9:36 PM

ప్రపంచశాంతి కోసం దేశ, విదేశాల నుండి ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వందలాదిగా తరలిరావడంతో కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని హిందూ, బౌద్ధ, జైన, సిక్కు సంప్రదాయల అధ్యాత్మిక గురువులు ఈ మహ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడవ రోజు కార్యక్రమంలో శాంతి కోసం పోరాడుతున్న మేధావులతో అనేక చర్చా కార్యక్రమాలు, ప్రసంగాలతో పాటు ప్రముఖ సంగీత, నృత్య కళాకారులతో కార్యక్రమాలు సాగాయి.

ఆధ్యాత్మిక కళతో సాగుతున్న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం 3వ రోజు భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్‌కర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్పిరిచువల్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఉప రాష్ట్రపతితో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని సమస్యలు అన్నీ యుద్ధాలతో పరిష్కారం కావని.. చర్చల ద్వారా సాధ్యం అవుతుంది అని అటువైపు అడుగేసిన భారత ప్రధాని లోతైన ఆధ్యాత్మిక ఆలోచన గొప్పదని అన్నారు భారత ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్‌కర్. మంచి అభివృద్ధితో ప్రపంచ శాంతి ఆధ్యాత్మికత ద్వారా వచ్చే ఫలితాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వివేకంతో కూడిన సమాజాన్ని పెంపొందిస్తూ.. ఆధ్యాత్మికతను పెంచేవిధంగా కృషి చేయాలి అని ఉపరాష్ట్రపతి అన్నారు.

‘వసుధైక కుటుంబం’గా ఉన్న భారతదేశం వైపు ప్రపంచదేశాల అడుగులు పడుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలపై ఈ మహోత్సవంలో పరిష్కారం కనిపించేలా కార్యక్రమం జరిగింది. భారతదేశం విదేశీ దండయాత్రలను చూసిందని.. సాంఘిక దురాచారాలను తరిమికొట్టే తత్వవేత్తలు మన దేశంలో ఉన్నారని అన్నారు. ప్రపంచం మొత్తం ఆరోగ్యం, యోగా కోసం భారతదేశం వైపు చూస్తోంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేంద్ర సాంస్కృతిక శాఖకు అభినందనలు. ఇక్కడి సంస్కృతి, యోగా, కల్చర్ వీటిన్నంటిని తెలుసుకునేందుకు అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మన కల్చర్ తియ్యదనాన్ని, గొప్పతనాన్ని తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనకు ఎంతైనా అవసరం ఉందని అన్నారు గవర్నర్ తమిళ్‌సై.