లిక్కర్ స్కాం కేసు: ఎమ్మెల్సీ కవిత భర్తతో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో సహా కవిత వ్యక్తిగత సిబ్బంది అయిన..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో సహా కవిత వ్యక్తిగత సిబ్బంది అయిన మరో ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే వీరి నలుగురు ఫోన్లు సీజ్ చేశారు. శుక్రవారం కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. కవిత భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
కవితకు కస్టడీ.. తదుపరి చర్యల్లో బీఆర్ఎస్..
కవితకు కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇవ్వడంతో తదుపరి చర్యలకు బీఆర్ఎస్ పూనుకుంది. స్వయంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రంగంలో దిగి.. ఢిల్లీలో అడ్వాకేట్స్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. న్యాయవాది సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ కవిత కేసు విషయంలో పని చేయనున్నారు. మరోవైపు ఈ కేసు కొలిక్కివచ్చే వరకూ కవిత కుటుంబసభ్యులు కొందరు ఢిల్లీలోనే మకాం వేయనున్నారట. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఢిల్లీకి షిఫ్ట్ కాగా.. ఎప్పటికప్పుడు ఢిల్లీ అప్‌డేట్స్‌ను ఆరా తెస్తున్నారు కేసీఆర్.