AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్ధరాత్రి దర్జాగా కారులో వచ్చి పని కానిచ్చారు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఖరీదైన కార్లలో కోందరు యువకుల వచ్చారు. గంట పాటు అక్కడే ఉండి వెళ్ళిపోయారు. వారెవరో అర్ధం కాక సీసీ కెమెరాలు గమనిస్తే అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయాల్లో ఖరీదైన కారులో వచ్చారు.

Hyderabad: అర్ధరాత్రి దర్జాగా కారులో వచ్చి పని కానిచ్చారు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Hyderabad
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 02, 2025 | 1:50 PM

Share

హైదరాబాద్‌లో ఓ ముఠా ఇనోవా కారులో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో రెండు రోజుల పాటు ఒకే తరహలో ఆవులను ఎత్తుకెళ్లిన ముఠా దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కారు వెనకాల భాగంలో వాటిని బలవంతంగా ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇదే రీతిలో ఆవులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అయితే ఈ ముఠా ఎవరన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

స్థానికంగా ఉండే గోశాల వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాల్లో ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇస్తున్నారు. బ్లాక్ కలర్ ఇన్నోవా కారులో వచ్చిన యువకులు ఈ అపహరణకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇనోవా నెంబర్ ఆధారంగా ఈ ముఠాను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. గతంలో బక్రీద్ సందర్భంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..

అప్పుడు కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముఠా ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌లోనే రెండు రోజుల పాటు ఈ ఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ముఠా కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..