Telangana: ఒక్కసారిగా పోస్టాఫీస్‌కు మహిళలు క్యూ.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
ఒక్కసారిగా మహిళామణులంతా పోస్టాఫీసు ఎదుట బారులు తీరారు. ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాలేదు.. పోస్టాఫీస్ సిబ్బంది కూడా ఏం ప్రకటించలేదు. మరి ఇంతకీ ఎందుకని మహిళలు వచ్చారని అనుకుంటున్నారా.? మరి ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి. ఆ వివరాలు..

వికారాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పరిగిలోని స్థానిక మహిళలు ఒక్కసారిగా పోస్టాఫీసు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే భాగ్యలక్ష్మీ స్కీం ద్వారా రూ. 2,500 నగదు జమ అవుతోందని స్థానికంగా వదంతులు రావడంతో.. వందలాది మహిళలు ఆ డబ్బులు తీసుకుందామని.. పోస్టాఫీసులో అకౌంట్‌లు తెరిచేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లల్ని సైతం పట్టుకుని లైన్‌లో నిల్చున్నారు.
ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా
అయితే ఇదంతా వట్టి పుకార్లు మాత్రమేనని.. భాగ్యలక్ష్మీ స్కీంకు సంబంధించిన ఎలాంటి సర్క్యూలర్ కూడా తపాలాశాఖకు రాలేదని.. సరైన సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ వెబ్‌సైట్లు, అధికారిక ప్రకటనలు ఫాలో అవ్వాలని తపాలా శాఖ సిబ్బంది కోరారు. అయితే తమ శాఖలో ఇలా అకౌంట్ల సంఖ్య పెరగడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




