Viral: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
పైకి చూసి ఫోటోలో ఉన్నది డెలివరీ బాయ్స్ అనుకునేరు.. వారు బంగారం షాప్ లో ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా.? ఈ స్టోరీ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మరి లేట్ ఎందుకు ఓ సారి చూసేయండి మరి ఇక్కడ.

దొంగలు రూటు మార్చారు. రోజు రోజుకీ మారుతున్న టెక్నాలజీ లాగే దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. చోరీచేసే విషయంలో తమ పంధామార్చుకుని కొత్త అవతారాలెత్తుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడే రోజులు పోయి.. పట్టపగలే దోపిడీలకు తెగబడుతున్నారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఎవరినీ లెక్కచేయడంలేదు. వచ్చామా.. పని పూర్తిచేసుకున్నామా.. సక్సెస్‌ఫుల్‌గా బయటపడ్డామా అన్నట్టుగా తయారయ్యారు. తాజాగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చి ఓ నగల దుకాణాన్ని దోచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఓ నగల షాపులో పట్టపగలు చోరీ జరిగింది. ఫుడ్ డెలివరీచేసే డెలివరీ బాయ్స్‌లా ఓ సంస్థకు చెందిన యూనిఫాం వేసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నగల దుకాణంలో కి ఎంట్రీ ఇచ్చారు. ఐదారు నిమిషాల్లోనే షాపు మొత్తం ఊడ్చుకెళ్లారు. షాపు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల డ్రెస్సులు ధరించిన ఇద్దరు యువకులు షాప్ లో చొరబడ్డారు. ముఖం కనిపించకుండా హెల్మెట్లు ధరించారు. లోపలికి వస్తూనే అక్కడున్న సేల్స్ మెన్ పై దాడి చేశారు. దుకాణంలోని బంగారు, వెండి ఆభరణాలను బ్యాగుల్లో వేసుకున్నారు. అక్కడ ఉన్న కుర్చీతో అద్దాలు పగలగొట్టి మరీ నగలు తీసుకున్నారు. ఆపై బైక్ మీద పరారయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు దుకాణ యజమాని. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దుకాణంలోని 20 కిలోల వెండి ఆభరణాలు, 125 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారని యజమాని పోలీసులకు వివరించాడు. కాగా, షాపులోని సీసీటీవీ కెమరాలో ఈ దొంగతనం మొత్తం రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Uttar Pradesh | Thieves disguised as delivery boys execute a robbery at a jewellery store in Ghaziabad. CCTV visuals of the crime. (24.07)
Visuals Source: Police pic.twitter.com/nPTgnWyIYV
— ANI (@ANI) July 25, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




