ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చిన 10వ తరగతి బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే..
కేరళరాష్ట్రంలో కన్హంగాడ్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల బాలిక బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఒక బిడ్డకు జన్మనించ్చింది. బాలికకు తీవ్ర రక్తశ్రావం కావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే బాలిక ప్రగ్నెంట్ అయిన విషయం తమకు తెలియనట్టు ఆమె తల్లి తెలిపింది.

పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగు చూసింది. బాలికకు తీవ్ర రక్తశ్రావం కావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసర్‌గోడ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఒక స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది. అయితే ఉన్నట్టుండి బాలిక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఒక ఆడ శిశువును జన్మనిచ్చింది. ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్త శ్రాసం అయ్యింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఒక ప్రవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఆక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రసవించిన సమయంలో బాలిక ఎనిమిది నెలల గర్బంతో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
అయితే ఇక్క ఆశ్చర్యకర విషయం ఏమిటంటే బాలిక గర్బవతి అన్న విషయం కుటుంబ సభ్యులకు ఇన్నాళ్లు తెలియకపోవడం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసిన హోస్దుర్గ్ పోలీసులు మాట్లాడుతూ బాలిక ప్రస్తుతం వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని.. ఈ సంఘటనలో లైంగిక వేధింపులు ఏమైనా జరిగాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




