AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?

నటీమణుల పాస్ట్ లైఫ్‌లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. కొన్నిసార్లు అవి బయటకొస్తే.. వాళ్ల కెరీర్లే క్లోజ్ అయిపోవచ్చు. తాజాగా ఓ నటి తన జీవితంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. మరి ఆమె ఎవరు.? ఏంటి ఆ స్టోరీ.?

Tollywood: ఫ్రెండ్‌తో 'వన్ నైట్ స్టాండ్'.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?
Heroine
Ravi Kiran
|

Updated on: Jul 28, 2025 | 6:07 PM

Share

తెరపై కనిపించే ఎంతోమంది నటీమణులకు.. తెరవెనుక చాలానే రహస్యాలు దాగుంటాయి. చైల్డ్‌హుడ్ క్రష్, బాడీ షేమింగ్, లవ్ లైఫ్, ప్రెగ్నెన్సీ, అబార్షన్.. ఇలా చాలానే జరిగి ఉంటాయి. అలాంటి పలు సంచలన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది ఓ టాప్ హీరోయిన్. ‘సేక్రెడ్ గేమ్స్’.. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. ఆ సిరీస్‌లో నటించిన హీరోయిన్ కుబ్రా సేథ్.. తన వ్యక్తిగత జీవితంపై ఓ పుస్తకం రాసింది. ‘ఓపెన్ బుక్’ అనే పేరిట రిలీజ్ చేసిన ఈ పుస్తకంలో తన జీవితంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది ఈ నటి.

ఒకసారి తన స్నేహితుడితో కలిసి అండమాన్ ట్రిప్ వెళ్లినప్పుడు.. అతడితో వన్ నైట్ స్టాండ్ జరిగిందని.. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అయినట్టు తెలిసిందని కుబ్రా సేథ్ చెప్పింది. ఆ సమయంలో ఎవరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నా.. మానసికంగా చాలా కృంగిపోయానని నటి తెలిపింది. ‘నేను అబార్షన్ చేయించుకోకపోతే, ఆ బిడ్డకు జన్మనిచ్చి జీవితాంతం సింగిల్ మదర్‌గా జీవించే ధైర్యం నాకు ఉండేది కాదు. ఈ విషయం నా మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చివరికి, నేను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను” అని కుబ్రా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

అబార్షన్ జరిగిన ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత కూడా కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కొన్నా. ‘నేను ఒక ట్రావెల్ షో షూటింగ్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభమైంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడప్పుడూ చాలా చిరాకుగా ఉండేది’ అని ఆమె పేర్కొంది. కాగా, కుబ్రా ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా వస్తోన్న ‘సన్ ఆఫ్ సర్దార్ -2’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..