AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: రాజమౌళి చెప్పిన కథను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెల్సా.? పాన్ ఇండియా స్టార్

ఒక్క క్యారెక్టర్ వస్తే చాలు.. కథ వినకుండానే రాజమౌళి సినిమాలకు ఓకే చెప్పేస్తారు చాలామంది నటీనటులు. అలాంటిది ఓ నటుడు మాత్రం రాజమౌళి సినిమాకు నో చెప్పాడు. మరి ఆ నటుడు ఎవరు.? ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు..

Rajamouli: రాజమౌళి చెప్పిన కథను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెల్సా.? పాన్ ఇండియా స్టార్
Rajamouli 4
Ravi Kiran
|

Updated on: Jul 30, 2025 | 9:25 AM

Share

జక్కన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా.. సినిమాకు బోలెడంత టైం తీసుకున్నా.. అది రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. టాలీవుడ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి‌దే. ఒక్క ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచమంతా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో మళ్లీ వరల్డ్‌వైడ్ అటెన్షన్‌ను తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి. అలాంటి జక్కన్న సినిమాల్లో ఒక్క పాత్ర వచ్చినా చాలు.. స్క్రిప్ట్ చూడకుండానే ఓకే చెప్పేసే నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటిది ఓ హీరో.. దర్శకధీరుడు రాజమౌళికి నో చెప్పాడు. ఆయన చెప్పిన కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. కట్ చేస్తే.. అదే కథను మరో హీరోతో తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు రాజమౌళి. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. రెబల్ స్టార్ ప్రభాస్.

ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఏంటంటే.? ‘స్టూడెంట్ నెంబర్ 1’. ప్రభాస్ వద్దన్నా ఈ కథను ఎన్టీఆర్‌తో తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు రాజమౌళి. మొదటగా రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ 1’ కథను ప్రభాస్‌కు వినిపించారట. ఆ కథ ప్రభాస్‌కు నచ్చకపోవడంతో డార్లింగ్ రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కాగా, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించాయి.

Follow Us
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..