OTT: 2 గంటల 2 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. సీన్ సీన్‌కు ఉత్కంఠే.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ గ్యారెంటీ
థ్రిల్లర్ ప్రేక్షకుల కోసం ఓ సస్పెన్స్ మూవీను తీసుకోచ్చేశాం. మరి ఆ మూవీ ఏంటి.? బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కొల్లగొట్టింది. ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. మరి ఓ సారి లుక్కేయండి మరి. చూసేయండి ఈ ఓటీటీ మూవీను..

పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం దొరికితే చాలు.. ఈ మధ్యకాలంలో యువత తమ కుటుంబంతో టైం గడపాలని నిర్ణయించుకుంటారు. ఇటీవల ఓటీటీలలోనే బోలెడన్ని సినిమాలు వస్తుండటంతో.. థియేటర్ల కంటే ఎంజాయ్ ఇంట్లోనే దొరుకుతోంది. మరి అలాంటివారి కోసం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా గురించి మీ ముందుకు తీసుకోచ్చేశాం. ఇది మిమ్మల్ని కచ్చితంగా షాక్‌కు గురి చేస్తుంది.
ఈ 2 గంటల 2 నిమిషాల సినిమా OTTలో బాగా పాపులర్ అయింది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే.. ఆ తర్వాత సీన్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. కేవలం 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా చివరి సీన్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక ప్రీ-క్లైమాక్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఆ సినిమా టైటిల్ ‘రోంత్’. ఈ సినిమాను వినీత్ జైన్, రతీష్, రెంగిత్ ఈవీఎం, జోజో జోస్ నిర్మించారు. ఇది మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇది మలయాళంతో పాటు హిందీ, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రోషన్ మ్యాథ్యూ, దిలీష్, లక్ష్మీ మీనన్, కృష కురుప్, రోషన్ అబ్దుల్, రాజేష్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కింది.
ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకి ప్రధాన బలాలు. అనిల్ జాన్సన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా థ్రిల్‌ను మరింత పెంచుతుంది. ‘రోంత్’ హాట్‌స్టార్ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. IMBD ఈ చిత్రానికి 7.4 రేటింగ్ ఇచ్చింది. షాహి కబీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 13న థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 9 కోట్లు వసూలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




