- Telugu News Photo Gallery Cinema photos Bobby Deol Starrer Aashram Web Series Heroine Tridha Choudhury Insta Photos Goes Viral, Details Here
Tollywood: అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో బీభత్సం.. ఈ హాట్ బ్యూటీ ఎవరంటే.?
'ఆశ్రమ్' వెబ్ సిరీస్.. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టించింది. ఇక ఈ బోల్డ్ సిరీస్‌లో బబితా పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఏం చేస్తోందా తెలుసుకుందామా..
Updated on: Jul 29, 2025 | 1:34 PM

కరోనా టైంలో విడుదలైన బోల్డ్ వెబ్ సిరీస్ 'ఆశ్రమ్'. ఈ సిరీస్‌కు ఇప్పటికే నాలుగు సీజన్ల విడుదల కాగా.. అన్నీ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. మిలియన్లలో వ్యూస్ సంపాదించాయి. అలాగే బాబీ డియాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది కూడా ఈ సిరీస్. ఇక ఇందులో బబితా పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.?

ఆమె మరెవరో కాదు త్రిధా చౌదరి. బబిత అనే బోల్డ్ క్యారెక్టర్‌లో అందం, స్టైల్, గ్లామర్‌తో ఆకట్టుకుంది ఆమె. ఈ 31 ఏళ్ల నటి తెలుగులో మూడు చిత్రాల్లో నటించింది. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వెర్సస్ సూర్య మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈమె నటించిన 'సో లాంగ్ వ్యాలీ' చిత్రం జూలై 25న థియేటర్లలోకి వచ్చింది. దీనితో పాటు, ఆమె పలు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. అలాగే ఇన్‌స్టాలో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచూ వెకేషన్ పిక్స్ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

ఆశ్రమ్ సిరీస్‌తో పాటు, బాండిష్ బాండిట్స్‌లోనూ త్రిధా నటనకు ప్రశంసలు అందాయి. వెస్ట్ బెంగాల్‌కు చెందిన త్రిధా.. హిందీతో పాటు, బెంగాలీ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. త్రిధా చౌదరి తన కెరీర్‌ని ‘దహ్లీజ్’ అనే టీవీ షో ద్వారా ప్రారంభించింది.

సూర్య వర్సస్ సూర్య, అనుకున్నది ఒకటి అయ్యిందోకటి, మనసుకు నచ్చింది లాంటి సినిమాలను తెలుగులో చేసింది ఈ అమ్మడు. త్రిధా చౌదరి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది త్రిధా చౌదరి




