AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Service: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..

హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జీహెచ్ఎంసీ యాప్‌తో పాటు వాట్సాప్‌ నగర వాసుల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. ఈ కొత్త వాట్సాఫ్‌ సర్వీస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం ప్రారంభించారు.

Whatsapp Service: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..
Hyderabad
Laxmikanth M
| Edited By: Anand T|

Updated on: Aug 02, 2025 | 10:09 AM

Share

హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జీహెచ్ఎంసీ యాప్‌తో పాటు వాట్సాప్‌ నగర వాసుల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. నగర ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానికులు వాళ్ల కాలనీల్లోని భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై తక్షణమే ఫిర్యాదు చేయగలగే విధంగా ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు.

ఇంతకు ముందు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. అయితే సమస్యలపై మరింత వేగంగా స్పందించేందుకు ఇప్పుడు వాట్సాప్ నంబర్ 81259 66586 ను ప్రారంభించామని ఆయన తెలిపారు. పౌరులు తమ ప్రాంతంలో ఎదురవుతున్న భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్ బిన్ ఓవర్‌ఫ్లో GVP పాయింట్‌ల వద్ద పేరుకొని పోయిన చెత్త తొలగింపు వంటి సమస్యల ఫోటోలు, లొకేషన్ వివరాలు ఈ నంబర్‌కు పంపించవచ్చు.

ఇలా వచ్చిన ఫిర్యాదులను అధికారులు ప తక్షణమే పరిష్కారం చూపుతారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రజల సహకారంతో పరిశుభ్ర నగర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..