నా పేరు M లక్ష్మీ కాంత్ రెడ్డి s/o M. కృష్ణారెడ్డి
Ex serviceman,
నేను తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈనాడు తెలుగు దినపత్రికలో 2000 సంవత్సరంలో జాయిన్ అయి నాలుగు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ లో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ లో సీనియర్ కరస్పాండెంట్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద వచ్చే శాఖల్లో న్యూస్ కవరేజ్ చేస్తున్నాను…
Jubilee Hills Results: 58 మంది బరిలో నిలిచిన జూబ్లీ హిల్స్ పోరులో 4వ స్థానం ఎవరిదో తెలుసా..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ నమోదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. అయితే 58 మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- Laxmikanth M
- Updated on: Nov 14, 2025
- 6:57 pm
Hyderabad: హైదరాబాదీస్ బీ అటెన్షన్.! 18 గంటలు మంచినీటి సరఫరా బంద్.. ఎక్కడెక్కడంటే.?
హైదరాబాదీలు బీ అటెన్షన్.! సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మరి ఆ ప్రాంతాలు ఏంటి.? ఏయే రోజుల్లో నీటి సరఫరా బంద్ కానుంది.? ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో ఓ సారి చూసేద్దాం. ఓ లుక్కేయండి మరి.
- Laxmikanth M
- Updated on: Oct 27, 2025
- 8:03 am
Hyderabad: ప్రతి ఓటు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఆయువు పట్టు.. జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు
Hyderabad: ఓటు ప్రాధాన్యతను వివరించడం, ఓటింగ్ శాతం పెంచేలా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వీప్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యెల్లారెడ్డిగూడ శ్రీ శారద మహిళా డిగ్రీ కాలేజీలో ఓటరు అవగాహన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
- Laxmikanth M
- Updated on: Oct 26, 2025
- 9:54 pm
Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఈ రోజు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-1కి సంబంధించిన మరమత్తు పనులు చేపట్టనున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ - 1కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో ఉన్నవారికి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
- Laxmikanth M
- Updated on: Oct 22, 2025
- 11:13 am
Indiramma Canteens: నగరవాసులకు గుడ్‌న్యూస్.. రూ.5కే భోజనం.. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
గరీబి హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిరమ్మ స్పూర్తితో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేసామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
- Laxmikanth M
- Updated on: Sep 29, 2025
- 3:39 pm
Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. ఎందుకంటే?
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా చూపిన చొరవను మంత్రి ప్రశంసించారు. ఎండోమెంటు శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేయగా.. సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వివరణ ఇచ్చారు.
- Laxmikanth M
- Updated on: Sep 25, 2025
- 6:45 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో 2 రోజులు తాగునీటి సరఫరా బంద్..
హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ప్రకటన చేసింది. 48 గంటల పాటు తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని.. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. ఆ ప్రాంతాలు ఏంటో.. పూర్తి వివరాలను తెలుసుకోండి..
- Laxmikanth M
- Updated on: Sep 8, 2025
- 7:02 am
Whatsapp Service: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..
హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జీహెచ్ఎంసీ యాప్‌తో పాటు వాట్సాప్ నగర వాసుల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. ఈ కొత్త వాట్సాఫ్ సర్వీస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం ప్రారంభించారు.
- Laxmikanth M
- Updated on: Aug 2, 2025
- 10:09 am
ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై హైడ్రా U టర్న్..!
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై మాట మార్చారు. ముందుగా చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కాలేజీని కూల్చేస్తామని ప్రకటించిన కమిషనర్, విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా కూల్చివేత చేయడం లేదని అన్నారు. ఈ నిర్ణయంపై విస్తృత చర్చ జరుగుతోంది.
- Laxmikanth M
- Updated on: Jul 10, 2025
- 7:55 pm
మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్నది అవాస్తవం- జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయన జలమండలి ఉన్నతాధికారులతో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. బ్యారేజ్ దిగువన ఆఫ్రాన్ కొంతమేరకు దెబ్బతిన్నదని దానికి మరమ్మత్తుల చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
- Laxmikanth M
- Updated on: Jun 30, 2025
- 2:54 pm
హైదరాబాద్‌లోని ఆ ఏరియాల్లో హైడ్రా కమిషనర్ రంగానాథ్ పర్యటన! స్థానికుల గుండెల్లో గుబులు..
హైదరాబాద్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లోని నాలాలను పరిశీలించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను కూడా పరిశీలించారు. స్థానికుల భయాలను పక్కన పెట్టి, నాలా శుభ్రతపైనే దృష్టి పెట్టారని అధికారులు తెలిపారు.
- Laxmikanth M
- Updated on: Jun 13, 2025
- 11:12 pm
Hyderabad: మాదాపూర్‌లో హైడ్రా కమిషనర్ పర్యటన.. త్వరలోనే దుర్గం చెరువుపై సమీక్ష..!
వర్షాకాలంలో అయినా కొంతమేర తగ్గిస్తే మాదాపూర్ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించడానికి వీలవుతుందా అనే విషయమై ఇందులో చర్చించనున్నారు. అలాగే దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతో పాటు.. వరద కాలువకు ఉన్న ఆటంకాలను కూడా పరిశీలించారు. అలాగే దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ వైపు మట్టి పోయడంపై..
- Laxmikanth M
- Updated on: Jun 9, 2025
- 9:16 pm