AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. ఎందుకంటే?

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ సమావేశం అయ్యారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ఘ‌ర‌ణ విషయంలో హైడ్రా చూపిన చొరవను మంత్రి ప్రశంసించారు. ఎండోమెంటు శాఖ‌లోని భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం అవ‌స‌రమ‌ని మంత్రి గుర్తు చేయ‌గా.. సీఎం అనుమ‌తితో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రంగనాథ్ వివ‌ర‌ణ ఇచ్చారు.

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. ఎందుకంటే?
Hydra Commissioner
Laxmikanth M
| Edited By: Anand T|

Updated on: Sep 25, 2025 | 6:45 PM

Share

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో గురువారం స‌చివాయ‌లంలోని ఫారెస్టు మినిస్ట‌ర్ ఛాంబ‌ర్‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ఘ‌ర‌ణ విష‌యంలో హైడ్రా చూపిన చొరవను, క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌రించినందుకు శ‌భాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, త‌న ప‌రిధిలో ఉన్న ఎండోమెంటు శాఖ‌లోని భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం అవ‌స‌రమ‌ని మంత్రి గుర్తు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్‌ స్పందింస్తూ.. సీఎం అనుమ‌తితో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి సురేఖ‌కు వివ‌ర‌ణ ఇచ్చారు.

దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాటిని ప‌రిక్షించేందుకు ఇప్ప‌టికే డీజీపీఎస్ స‌ర్వే చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. అందుకోసం ప్ర‌భుత్వ ప‌రంగా… శాఖ ప‌రంగా కావాల్సిన సాంకేతిక అంశాల‌పై దృష్టి సారిస్తామ‌ని చెప్పారు. హైడ్రా వ‌చ్చాక చేప‌ట్టిన ప‌నుల వివ‌రాల‌ను రంగనాథ్ మంత్రికి స‌మ‌గ్రంగా వివ‌రించారు. అయితే, మంచి ప‌నులు చేసే సంద‌ర్భంగా కొన్ని ఇబ్బందులు ఎద‌ర‌వుతాయ‌ని, కానీ సామూహిక ప్ర‌యోజ‌నంలో భాగంగా చేశార‌ని మంత్రి సురేఖ కొనియాడారు.

హైడ్రా చేస్తున్న ప‌నులు ప్రయోజనాలు రానున్న కాలంలో ప్రజలందరికీ తెలుస్తాయ‌ని మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సురేఖ వ‌రంగ‌ల్ నాలాల ఆక్ర‌మ‌ణ‌లను కూడా రంగ‌నాథ్‌తో చ‌ర్చించారు. వాటిని ప‌రిష్క‌రించేందుకు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని అన్నారు. కాగా, బ‌తుక‌మ్మ కుంట వేడ‌కల‌కు మంత్రి సురేఖ‌ను, రంగ‌నాథ్ ఆహ్వానించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..