AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి

రాష్ట్రప్రజలకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా తమ హైఎండ్‌ బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దసరాకు ల‌క్కీ డ్రా పేరుతో సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ లక్కీడ్రాలో గెలుపొందిన వారు రూ.5.50 లక్షల విలువగల బహుమతులు గెలుచుకోవచ్చని స్పష్టం చేసింది.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్..  బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి
Tgsrtc
Anand T
|

Updated on: Sep 25, 2025 | 7:10 PM

Share

దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేలను సంస్థ ప్రకటించింది.

ఈ లక్కీ డ్రా లో పాల్గొనేందుకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.

Tgsrtc

Tgsrtc

ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా బాక్స్‌ను ఓపెన్ చేసి అక్టోబర్ 8న అధికారులు విజేతలను ప్రకటిస్తారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి టీజీఎస్‌ ఆర్టీసీ నగదు బహుమతులను అందజేస్తుంది.

దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారీ 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రయాణికుల రద్దీని  బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.