AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే.. ఈ ఒక్కటి చేయండి!

తెల్లని బట్టలు కొద్దిరోజుల్లోనే పసుపు రంగులోకి మారి మెరుపును కోల్పోతుంటాయి. అయితే బ్లీచ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఉప్పు, వెనిగర్, నిమ్మరసం, హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా వంటి ఇంట్లోనే ఉండే పదార్థాలతో తెల్లని బట్టలను ఎక్కువకాలం కొత్తవాటిలా ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఈ సులభమైన లాండ్రీ చిట్కాలు బట్టల మరకలు, దుర్వాసనను తగ్గించడంలో కూడా సహాయపడతాయి..

తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే.. ఈ ఒక్కటి చేయండి!
Remedies To Keep White Clothes Fresh And Bright
Srilakshmi C
|

Updated on: Aug 06, 2026 | 3:06 PM

Share

తెల్లని బట్టలు ధరించడం చాలా మందికి ఇష్టం. అవి చూడటానికి ఆకర్షణీయంగా, శుభ్రంగా కనిపిస్తాయి. అయితే వాటి తెల్లదనాన్ని ఎక్కువకాలం అలాగే నిలుపుకోవడం అంత సులభం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తెల్లని బట్టలు క్రమంగా పసుపు రంగులోకి మారి వాటి మెరుపును కోల్పోతాయి. చాలామంది మరకలు తొలగించేందుకు బ్లీచ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే బ్లీచ్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల బట్టల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాలతో తెల్లని బట్టలను శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.

ఉప్పుతో తెల్లదనాన్ని కాపాడండి

తెల్లని బట్టలను ఉతికే ముందు గోరువెచ్చని నీటిలో 1–2 టీస్పూన్ల ఉప్పు కలపండి. ఆ నీటిలో బట్టలను 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టి, తర్వాత డిటర్జెంట్‌తో ఉతకండి. ఇలా చేయడం వల్ల బట్టలు పసుపు రంగులోకి మారే అవకాశం తగ్గుతుంది.

వెనిగర్‌తో మరకలు, దుర్వాసనకు చెక్

బట్టలు ఉతికే నీటిలో అర టీస్పూన్ వెనిగర్ కలిపితే తెల్లని బట్టల మెరుపు నిలిచి ఉంటుంది. అలాగే చెమట వాసన, తేలికపాటి మరకలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. వాషింగ్ మెషీన్‌లో ఉతికేటప్పుడు కూడా వెనిగర్‌ను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో మెరుపు

తెల్లని బట్టలపై ఉన్న మరకలను తొలగించడంతో పాటు పసుపు రంగు రాకుండా ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి బట్టలను కొంతసేపు నానబెట్టి ఉతికితే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసంతో సహజమైన తెల్లదనం

2–3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని నీటిలో కలిపి, తెల్లని బట్టలను 1 నుంచి 2 గంటల పాటు అందులో నానబెట్టండి. ఆ తర్వాత డిటర్జెంట్‌తో ఉతికితే బట్టలపై ఉన్న దుర్వాసన తొలగిపోవడమే కాకుండా, సహజమైన తెల్లదనం కూడా నిలిచి ఉంటుంది.

బేకింగ్ సోడాతో కొత్తలాంటి మెరుపు

ఒక బకెట్ నీటిలో 1–2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి, తెల్లని బట్టలను 30 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత సాధారణంగా సబ్బు లేదా డిటర్జెంట్‌తో ఉతకండి. ఇది మరకలను తగ్గించి, బట్టల మెరుపును ఎక్కువకాలం నిలుపుతుంది.

తెల్లని బట్టల అందాన్ని కాపాడుకోవాలంటే వాటిని రంగు బట్టలతో కలిసి ఉతకకుండా ఉండటం మంచిది. అలాగే బట్టలపై ఉన్న సంరక్షణ సూచనలను (Care Label) తప్పకుండా పాటించాలి. బ్లీచ్, వెనిగర్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలను ఉపయోగించే ముందు బట్టలో కనిపించని చిన్న భాగంలో పరీక్షించడం కూడా ఉత్తమం. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే, మీ తెల్లని బట్టలు ఎక్కువకాలం కొత్తవాటిలా మెరిసిపోతాయి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!