AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills Results: 58 మంది బరిలో నిలిచిన జూబ్లీ హిల్స్ పోరులో 4వ స్థానం ఎవరిదో తెలుసా..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ నమోదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. అయితే 58 మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Jubilee Hills Results: 58 మంది బరిలో నిలిచిన జూబ్లీ హిల్స్ పోరులో 4వ స్థానం ఎవరిదో తెలుసా..?
Jubilee Hills Results
Laxmikanth M
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 14, 2025 | 6:57 PM

Share

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు.  రెండోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. మొత్తంగా లెక్కించిన 1,94,631 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,945, BRS అభ్యర్థి 74,234 ఓట్లు రాగా.. BJP అభ్యర్థి(17,041) డిపాజిట్ కోల్పోయారు.

మొదటి మూడు స్థానాల్లో ఈ మూడు పార్టీలు నిలిచాయి. మరి నాలుగో స్థానం ఎవరిది ? 58 మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరు ? ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఈ స్థానంలో నిలిచారనే విషయం ఆసక్తి కలిగించే అంశం. అయితే ఇంతటి ఉత్కంఠభరితమైన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానం ఎవరూ ఊహించని గుర్తుకు దక్కింది. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానం దక్కించుకుంది మరేదో కాదు. మాకు వీళ్లెవరూ నచ్చలేదని చెప్పే నోటా గుర్తు.

సాధారణంగా నోటాకు పెద్దగా ఓట్లు రావు. అందులోనూ తక్కువ శాతం ఓట్లు పోలయ్యే చోట.. నోటాకు వచ్చే ఓట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నోటా గుర్తుపై ఏకంగా 924 మీట నొక్కారు. అంటే 924 మంది ఓటర్లు తమకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ లాంటి ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికల్లో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా విశేషమే.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..