Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఈ రోజు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-1కి సంబంధించిన మరమత్తు పనులు చేపట్టనున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ - 1కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో ఉన్నవారికి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

మంచి నీటి సరఫరా పైప్‌లైన్ మరమ్మతులు, లీకేజీ, సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన పైప్‌లైన్‌లో సమస్యలు వంటి వివిధ కారణాలతో హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. తాజాగా కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు ఉన్న హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్- 1 సంబందించిన పైప్ లైన్ కు అత్యవసర మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 1కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా సైదాబాద్, సంతోష్ నగర్, బొగ్గుల కుంట, నల్ల కుంట వంటి అనేక ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొనున్నాయి.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
O&M డివిజన్–I పరిధిలోని మీరాలం, కిషన్‌బాగ్, అల్ జుబైల్ కాలనీ,
O&M డివిజన్–II పరిధిలోని సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాంగఢ్, యాకూత్‌పురా, మదన్నపేట్, మహబూబ్ మెన్షన్,
O&M డివిజన్–IV పరిధిలోని బోగ్గులకుంట, అఫ్జల్‌గంజ్,
O&M డివిజన్–V పరిధిలోని నారాయణగూడ, అదిక్‌మెట్, శివం, నల్లకుంట, చిల్కల్ గూడ,
O&M డివిజన్–VIII పరిధిలోని రియాసత్‌నగర్, అలియాబాద్,
O&M డివిజన్–XVIII పరిధిలోని బోంగూలూర్
అని హైదరాబాద్ ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. అంతేకాదు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కలిగే అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.. మీ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతేకాదు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




