JEE Main 2026 Preparation Tips: కోచింగ్ లేకుండా జేఈఈ మెయిన్ 2026కి ఎలా ప్రిపేర్ కావాలి?
how to get rank in JEE Main 2026 without coaching: జేఈఈ మెయిన్ 2026 పరీక్షలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. యేటా 24 లక్షల మంది ఈ పరీక్ష రాస్తుంటారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి? ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దే చదివి రాణించవచ్చా? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. జేఈఈ మెయిన్ పరీక్షలో

జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తన ప్రకటనలో తెలిపింది. ఇక యేటా 2 సార్లు జరిగే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా పోటాపోటీగా విద్యార్ధులు హాజరవుతుంటారు. యేటా 24 లక్షల మంది ఈ పరీక్ష రాస్తుంటారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి? ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దే చదివి రాణించవచ్చా? వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. జేఈఈ మెయిన్ పరీక్షలో ర్యాంకు కొట్టాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
చక్కని ప్రణాళిక
పరీక్షకు మాత్రమే కాదు.. ఏ పనిలో విజయం సాధించాలన్నా చక్కని ప్రణాళిక చాలా అవసరం. జేఈఈ మెయిన్ పరీక్షలకు కూడా ఇదే మంత్రం పని చేస్తుంది. పరీక్ష ఇంకా కొద్ది నెలల సమయమే ఉన్నందున ఇప్పట్నుంచే అన్ని సబ్జెక్టులను సమానంగా కవర్ చేసుకుంటూ సిలబస్‌ను విభజించుకుని ప్రిపరేషన్ సాగించాలి. అందుకు మంచి టైమ్‌టేబుల్ వేసుకోవాలి. ఇందులో ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరకూడదనే నిబంధన పెట్టుకోవాలి. మూడ్ బాలేదనీ, సినిమా చూడాలనీ వీటిని వాయిదా వేయకూడదు. రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ర్యాంకు సాధించొచ్చు.
ఎక్కువ సార్లు ప్రాక్టీస్
జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్‌లు, పాత ప్రశ్నపత్రాల పాత్ర ఎంతో కీలకం. వీటి ద్వారా పరీక్ష సమయంలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకుని, మీ పెర్ఫామెన్స్‌ను అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ పొరపాటు చేస్తున్నారో కూడా సులువుగా గుర్తించడానిక అవకాశం ఉంటుంది. వారంలో కనీసం ఒక్క ప్రశ్నపత్రం అయినా సాల్వ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి.
టైం మేనేజ్‌మెంట్
విద్యార్ధులకు టైం మేనేజ్‌మెంట్ చాలా అవసరం. ముఖ్యంగా పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారికి టైం మేనేజ్‌మెంట్, రివిజన్‌పై పట్టు ఉండాలి. ఓ వైపు థియరీ పార్ట్ చదువుతూనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. స్టడీ సెషన్‌లో చివరి 30 నిమిషాలను రివిజన్‌కు కేటాయిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రిపరేషన్ సమయంలో వచ్చే సందేహాలను సీనియర్లు, లెక్చరర్ల ద్వారా నివృతి చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను కూడా తెలివిగా ఉపయోగించువాలి.
ఎన్సీసీఆర్టీ పుస్తకాలు మరవొద్దు
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన కీలక కాన్సెప్టులను అర్థం చేసుకోవాలంటే ఎన్సీసీఆర్టీ పుస్తకాలే కీలకం. నిపుణులు తయారు చేసిన స్టడీ మెటీరియల్స్‌ను కూడా చదవొచ్చు. ఉచితంగా ఆన్‌లైన్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాంలు ఎన్నో ఉన్నాయి. వీటిని వాడుకోవచ్చు.
సోషల్ మీడియాకు దూరం
మీ ప్రిపరేషన్ సాఫీగా సాగాలంటే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. ముఖ్యగా సోషల్ మీడియా మీ దృష్టిని మరల్చే ప్రమదం ఉంది. అందుకే అటుగా వెళ్లకూడదు. ప్రిపరేషన్‌పై ఫోకస్ పెట్టడానికి ఆరోగ్యం కూడా అవసరమే. ప్రిపరేషన్ సమయంలో స్ట్రెస్‌కు గురికాకుండా చూసుకోవాలి. అందుకు మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. యోగా, ధ్యానం వంటి ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడతాయి. మంచి ఆహారం, తగినంత నిద్ర కూడా చాలా అవసరం.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




