AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు పెడితే నెగటివ్ ఎనర్జీ, ఆర్ధిక ఇబ్బందులు దూరం..

వాస్తు శాస్త్రం వలెనే.. ఫెంగ్ షుయ్ కూడా ఒక చైనీస్ నిర్మాణ సాంకేతికత గురించి తెలియజేస్తుంది. చాలా మంది ఫెంగ్ షుయ్ చెప్పిన విషయలను విశ్వసిస్తారు. ఫెంగ్ షుయ్ ని పాటిస్తే ఇంటికి సానుకూల శక్తి మరియు శ్రేయస్సు వస్తుంది. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ వస్తువులు ఆర్థిక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఆ వస్తువులు ఏమిటంటే..

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు పెడితే నెగటివ్ ఎనర్జీ, ఆర్ధిక ఇబ్బందులు దూరం..
Feng Shui Tips
Surya Kala
|

Updated on: Oct 22, 2025 | 7:45 AM

Share

ఇంటి అలంకరణ కోసం మనం చాలా వస్తువులను ఉంచుకుంటాము. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని దూరం చేసి సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతుంది. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులను తొలగిస్తుందని విశ్వాసం. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఈ చిత్రాలు పెట్టండి ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో సూర్యోదయాలు, పర్వతాలు, జలపాతాలు , గుర్రాల చిత్రాలను ఉంచడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఒక వ్యక్తి శ్రేయస్సు , విజయ అవకాశాలను పెంచుతుంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటికి నైరుతి దిశలో నవ్వుతున్న కుటుంబ ఫోటోలను ఉంచడం వల్ల సంబంధాలను బలోపేతం చేస్తుంది.

ఈ మొక్కలను ఉంచుకోవచ్చు ఇంట్లో వెదురు చెట్టు ఉంచుకోవడం వల్ల శ్రేయస్సు పెరుగుతుందని ఫెంగ్ షుయ్ నమ్మకం. కుటుంబ సభ్యులు సమావేశమయ్యే ప్రదేశంలో దాన్ని ఉంచండి. ఇంకా ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.

ఇవి కూడా చదవండి

డబ్బు సమస్యల నుంచి ఉపశమనం కోసం ఫెంగ్ షుయ్ లో తాబేలు సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనంగా ఇంట్లో ఫౌంటెన్ లేదా అక్వేరియం ఉంచడం కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశ వీటిని ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.

ప్రతికూల శక్తి దూరం చేసేందుకు ఫెంగ్ షుయ్ లో విండ్ చైమ్స్ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూల శక్తిని కూడా పెంచుతాయని నమ్ముతారు . ఇది ప్రతికూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. కనుక ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా కిటికీలపై విండ్ చైమ్‌లను ఉంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.