- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Neem tree helps in getting rid of Shani and Pitra Dosh, know details
Vastu Tips for Neem Plant: శని, పితృ దోషాలను తొలగించే వేప చెట్టు.. ఇంట్లో ఏ దిశలో నాటాలంటే
ఇప్పుడంటే ఇరుకు ఇల్లు.. గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో జీవిస్తున్నారు.. కానీ ఇంకా పల్లెల్లో పచ్చని వాతారణం.. ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ అందులో వేప చెట్టు సహా రకరకాల పువ్వు, కూరగాయల మొక్కలు కనిపిస్తూ ఎంతో అందంగా ఉంటాయి. గత కొంత కాలం క్రితం వరకూ ప్రతి ఇంట్లో వేప చెట్టుని పెంచుకునేవారు. ఈ వేప చెట్టు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఔషధాలకు నెలవు. అంతేకాదు జ్యోతిషశాస్త్రంలో వేప చెట్టు దైవిక శక్తులకు కూడా నిలయం.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టుని ఏ దిశలో పెంచుకోవాలంటే..
Updated on: Sep 07, 2025 | 4:06 PM

హిందూ మత గ్రంథాలలో చెట్లు, మొక్కలతో సహా ప్రకృతిలోని ప్రతి అంశానికి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. వీటిలో ఒకటి వేప చెట్టు. ఇది ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా జ్యోతిషశాస్త్రంలో ఈ చెట్టుకి చాలా విశేషమైన ప్రాముఖ్యమైంది. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం వేప చెట్టు శనీశ్వరుడికి, కేతువులకు సంబంధించినది. ఈ రెండు గ్రహ దోషాల సమస్యతో ఇబ్బంది పడేవారు వేప చెట్టును నాటడం, దానిని పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

వేప చెక్కతో హవనము చేయడం ద్వారా... శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది. శనీశ్వరుడు సంతోషించి భక్తుడిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తాడు. దీనితో పాటు నీటిలో వేప ఆకులను కలిపి స్నానం చేయడం వల్ల కేతువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో వేపతో శనిదేవుని ఆశీస్సులు ఎలా పొందాలి. పితృ దోషం నుంచి ఎలా ఉపశమనం లభిస్తుంది తెలుసుకుందాం..

వేప చెట్టు దైవిక శక్తులకు నిలయం అని అంటారు. అటువంటి పరిస్థితిలో, ఇంటి దక్షిణం లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును నాటండి. ఈ స్థానం ప్రతికూల శక్తుల నుంచి రక్షణను ఇస్తుంది. సానుకూల గ్రహ ప్రభావాలను బలపరుస్తుంది. ఈ దిశలో వేప నాటడం.. వేప నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. దీనితో పాటు పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది. పితృ దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

శని దోషం నుంచి ఉపశమనం పొందడానికి మరియు శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి.. వేప చెక్కతో చేసిన దండను ధరించాలి. ఇలా చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది, శనికి సంబంధించిన అశుభ ప్రభావం ఉండదని విశ్వాసం.

ఆదివారం సూర్యోదయ సమయంలో వేప చెట్టుకు నీరుని సమర్పించడం వలన జాతకంలో అశుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు శాంతిస్తాయి. జ్యోతిషశాస్త్రంలో వేప చెట్టును కుజుడు స్వరూపంగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో నాటడం మంచిది.

అయితే ఇంట్లో ఉత్తరం లేదా తూర్పున వేప చెట్టును నాటకూడదని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఈ దిశల నుంచి వచ్చే సానుకూల శక్తిని నిరోధించగల పెద్ద చెట్టు.

ఇంట్లో చెట్లు పెంచుకోగలికే స్థలం ఉంటే తప్పని సరిగా వేప చెట్టుని పెంచుకోండి. అధ్యత్మికంగానే కాదు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఇస్తుంది. వేప చెట్టు సర్వరోగ నివారిణి. ఈ చెట్టు నుంచి వీచే గాలి కూడా ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.




