- Telugu News Photo Gallery Spiritual photos Mercury Transit in Virgo: Lucky zodiac signs and financial gains details in Telugu
Mahapurusha Yoga: భద్ర యోగం.. ఈ రాశుల వారు నక్క తోకను తొక్కినట్టే!
Budh Gochar 2025: సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో సంచరిస్తుంది. కన్యారాశి బుధుడికి స్వక్షేత్రం, ఉచ్ఛక్షేత్రం. శుభ పరిణామాలకు, శుభ వార్తలకు కారకుడైన బుధుడు ఈ రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బుధుడి కన్యారాశి ప్రవేశం కారణంగా ఇందులో మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు భద్ర యోగం అనే మహాపురుష యోగం పట్టడం కూడా జరుగుతుంది. బుధుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. సింహ, మకర రాశులకు ధన యోగాలు కలుగుతాయి.
Updated on: Sep 07, 2025 | 12:46 PM

సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో సంచరిస్తుంది. కన్యారాశి బుధు డికి స్వక్షేత్రం, ఉచ్ఛక్షేత్రం. శుభ పరిణామాలకు, శుభ వార్తలకు కారకుడైన బుధుడు ఈ రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బుధుడి కన్యారాశి ప్రవేశం కారణంగా ఇందులో మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు భద్ర యోగం అనే మహాపురుష యోగం పట్టడం కూడా జరుగుతుంది. బుధుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. సింహ, మకర రాశులకు ధన యోగాలు కలుగుతాయి.

సింహం: ఈ రాశివారికి ధన స్థానంలో ధన స్థానాధిపతి బుధుడు ఉచ్ఛ పడుతుండడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సామాజిక హోదా, స్థాయి పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి ఆస్కారముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

కన్య: ఈ రాశిలో బుధుడు ఉచ్ఛ పట్టడం వల్ల భద్ర మహా పురుష యోగం పడుతోంది. ఫలితంగా ఈ రాశివారు ప్రముఖులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. రాజకీయంగా అధికార యోగం పడుతుంది.

ధనుస్సు: ఈ రాశికి దశమ కేంద్రంలో బుధుడి ప్రవేశం వల్ల భద్ర యోగం అనే మహాపురుష యోగం పడుతోంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అగ్రస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సమర్థతకు, ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి.

మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్య స్థానాధిపతి బలంగా సంచరించడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా రాణిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మీనం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్ఛలోకి రావడం వల్ల భద్ర యోగమనే మహా పురుష యోగం ఏర్పడింది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఉద్యోగంలో వీరికి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరు కుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.



