Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో 2 రోజులు తాగునీటి సరఫరా బంద్..
హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ప్రకటన చేసింది. 48 గంటల పాటు తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని.. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. ఆ ప్రాంతాలు ఏంటో.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో 3000 మిమీ డయా ఎమ్.ఎస్. పంపింగ్ మెయిన్‌పై అమర్చబడిన 900 మిమీ డయా వాల్వులు మార్పిడి పనులు జరుగుతున్నాయి. 09.09.2025 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11.09.2025 గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 48 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
ఈ కారణంగా క్రింది డివిజన్ ప్రాంతాలకు సూచించిన తేదీలలో నీటి సరఫరా నిలిపివేయబడుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..
1. ఓ అండ్ ఎం డివిజన్- 6 (ఎస్.ఆర్.నగర్): ఎస్.ఆర్.నగర్ సనత్‌నగర్, బోరబండ, ఎస్‌పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకట్రావు నగర్, యెల్లారెడ్డిగూడ, సోమజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, జూబ్లీహిల్స్ కొంత భాగం, తాటిఖానా కొంత భాగం..
2. ఓ అండ్ ఎం డివిజన్- 7: లాలాపేట్ కొంత భాగం, తార్నాకా కొంత భాగం.
3. ఓ అండ్ ఎం డివిజన్- 9: కుకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, యెల్లమ్మబండ, మూసాపేట్, భారత్‌నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కెపిహెచ్‌బి, బాలాజీనగర్, హష్మత్పేట్ సెక్షన్.
4. ఓ అండ్ ఎం డివిజన్- 12: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గజులరామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్.
5. ఓ అండ్ ఎం డివిజన్- 8: అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మాచ్చబోలారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, మౌలాలి రిజర్వాయర్.
6. ఓ అండ్ ఎం డివిజన్- 14: (కాప్రా మున్సిపాలిటీ పరిధి): చర్ల పల్లి, సాయిబాబానగర్, రాధికా సెక్షన్లు, కైలాసగిరి పాత మరియు కొత్త రిజర్వాయర్ ప్రాంతాలు, హౌసింగ్ బోర్డు సెక్షన్, మల్లాపూర్ కొంత భాగం.
7. ఓ అండ్ ఎం డివిజన్- 15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్ కొంత భాగం, గచ్చిబౌలి కొంత భాగం, నల్లగండ్ల కొంత భాగం.
8. ఓ అండ్ ఎం డివిజన్- 17: హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు.
9. ఓ అండ్ ఎం డివిజన్- 19: పొచారం.
10. ఓ అండ్ ఎం డివిజన్- 21: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్పకాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు.
11. ఓ అండ్ ఎం డివిజన్- 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్ సెక్షన్లు.
12. ట్రాన్స్‌మిషన్ డివిజన్- 4: మెఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, ఏఐఐఎంఎస్బి బినగర్.
13. గ్రామీణ నీటి సరఫరా (RWS) ఆఫ్‌టేక్స్: అలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మెడ్చల్/శామీర్‌పేట్) ప్రాంతాలు.
కాబట్టి పైన పేర్కొన్న నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని జలమండలి ప్రకటనలో కోరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
