Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూరు ప్రాజెక్టు ఫేజ్–3 మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ పనులతో పాటు టీఎస్ ట్రాన్స్‌కో సాధారణ నిర్వహణ పనులు కూడా జరగనున్నాయి. రాత్రి 8 గంటల వరకు పనులు కొనసాగనున్న నేపథ్యంలో 12 గంటల పాటు నీటి సరఫరా నిలిచే అవకాశం ఉంది.

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్–3 మెయిన్ పైప్‌లైన్‌లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అదేవిధంగా, టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు కూడా నిర్వహించనున్నారు. ఈ పనులు జనవరి 17, శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.
డివిజన్–9: కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.
డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.
డివిజన్–17: గోపాల్ నగర్.
డివిజన్–22: తెల్లాపూర్.
ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
