AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

ఈ రోడ్డు ఎప్పుడు రైతులతో బిజీ ఉంటుంది. వ్యవసాయ పనుల కోసం ఇక్కడి నుంచే వెళ్తారు. అయితే ఇదే రోడ్డులో వివిధ రకాల పూజల పేరుతో జనాన్ని భయపెట్టిస్తున్నారు. కుంకుమ, పసుపుతో నింపి వేశారు. దీంతో ఈ రోడ్డు నుంచి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు.

Telangana: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Representative Image
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 10, 2025 | 8:54 AM

Share

సైన్స్ అండ్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. 5G నుంచి 6G వైపునకు అడుగులు వేస్తున్నాం. అలాగే ఏఐను కూడా వాడుకలోకి తీసుకొచ్చాం. ఇంతటి అభివృద్ధి ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతున్నారు. దెయ్యాలు, భూతాలు అంటూ క్షుద్రపూజలు చేస్తున్నారు. ఆ కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా పెద్దపల్లిలో చోటు చేసుకుంది.

ఇది చదవండి: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ ఆఫీసు సమీపంలోని రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు, విస్తారాకులో అన్న ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి, నిమ్మకాయలు, కొబ్బరికాయను పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే నివాస ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆది, గురువారాల్లో క్షుద్ర పూజలు నీరుకుల్ల రోడ్డులో ఎక్కువగా చేస్తున్నారు భూతవైద్యులు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిపై నుంచి తిప్పి వీటిని రోడ్డుపై పెడుతున్నారని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట వీటిపై నుంచి ఎవరైనా దాటితే అనుమానంతో ఏదో అవుతోందని భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను నమ్మొద్దని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.

ఇది చదవండి: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే