AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే

Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే

Ravi Kiran
|

Updated on: Oct 06, 2025 | 9:03 AM

Share

అర్దరాత్రి మండీలో భోజనం తిన్న ఎనిమిది మంది వ్యక్తులు.. ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి వార్త చూసేయండి మరి.

హైదరాబాద్ టోలీచౌకిలో ఫుడ్‌పాయిజన్‌ కలకలం రేపింది. ఓ మండీ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైంది ఒక కుటుంబం. మిడ్‌నైట్‌ మండీలో భోజనం చేసిన వెంటనే బాధితులకు విపరీతమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిల్వచేసిన, పాడైపోయిన మాంసం కారణంగానే ఈ ఫుడ్‌పాయిజన్‌ జరిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 8మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.