SWAYAM Admissions 2025: స్వయం జులై సెషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్షల తేదీలు ఇవే
WAYAM 2025 జనవరి సెషన్ సెమిస్టర్ పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు స్వయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా జులై సెమిస్టర్ సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు..

స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ (SWAYAM 2025) జనవరి సెషన్ సెమిస్టర్ పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు స్వయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా జులై సెమిస్టర్ సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అక్టోబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజును అక్టోబర్ 31 వరకు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. నవంబర్ 1 నుంచి 3 వరకు అప్లికేషన్ సవరణ విండో ఓపెన్ అవుతుంది. మొత్తం 647 కోర్సుల్లో ప్రవేశాలకుగానూ స్వయం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 11, 12, 13, 14 తేదీల్లో హైబ్రిడ్ మోడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానం)లో నిర్వహించనున్నారు.
స్వయం 2025 ప్రవేశాల దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో ‘టెట్’ లేని టీచర్లు ఎంత మందో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అర్హతలేని ఉపాధ్యాయులు మొత్తం 45,742 మంది ఉన్నట్లు సర్కార్ వెల్లడించింది. సుప్రీంకోర్టు గతనెలలో ఇచ్చిన చారిత్రక తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే 2027 ఆగస్టు 30వ తేదీ నాటికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉత్తీర్ణత కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ టెట్ లేని వారి జాబితాను బయటకు తీసింది. రాష్ట్రంలో మొత్తం 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇందులో 45,742 మందికి టెట్ అర్హత లేనట్లు గుర్తించింది. టీచర్ల టెట్ అర్హత రెండేళ్లే గడువు ఉండటంతో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం మేరకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




