AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతకాని దద్దమ్మలనుకున్నామే.. 32 ఫోర్లు, 3 సిక్సర్లతో టీమిండియాకు ముందే వార్నింగ్ ఇచ్చారుగా.. ఎవరంటే.?

ఆట తెలియదు.. జాతీయ జట్టులో చోటు దక్కలేదు. పోయి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోమ్మా.. అని అందరూ అనుకున్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఆటగాళ్లు ఇద్దరూ..! తమ సత్తా చాటారు. ఇంతకీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే.? ఆ వివరాలు ఇలా..

చేతకాని దద్దమ్మలనుకున్నామే.. 32 ఫోర్లు, 3 సిక్సర్లతో టీమిండియాకు ముందే వార్నింగ్ ఇచ్చారుగా.. ఎవరంటే.?
Team India Vs Australia
Ravi Kiran
|

Updated on: Oct 07, 2025 | 12:14 PM

Share

ఫామ్‌లేమి చాలామంది ఆటగాళ్లను జట్టుకు దూరం చేస్తుంది. సీనియర్ ఆటగాళ్లు అయినా సరే.! ఈ సమస్య ఉంటే కచ్చితంగా చోటు కోల్పోవాల్సిందే. ఇప్పుడు మేము చెప్పబోయే ఆటగాళ్లు కూడా ఇదే కోవకు వస్తారు. వీరిద్దరూ టీమిండియాపై తన సత్తా చాటారు. అయితే ఆ తర్వాత ఫామ్ లేమితో సతమతమయ్యారు. తుది జట్టులో చోటు కోల్పోయారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

మ్యాట్ రెన్‌షా, మార్నాస్ లబూషేన్.. తాజాగా జరుగుతోన్న షెఫ్ఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. క్వీన్స్‌ల్యాండ్ తరపున బరిలోకి దిగిన రెన్‌షా, లబూషేన్.. రెండు సెంచరీలతో మోత మోగించారు. క్వీన్స్‌ల్యాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న లబూషేన్.. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి.. తిరిగి తన ఫామ్ రాబట్టుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్ల సెంచరీలతో ఆ జట్టు స్కోర్ 612 పరుగులకు చేరింది. లబూషేన్ మొత్తంగా 206 బంతులు ఎదుర్కుని 160 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్

ఇవి కూడా చదవండి

అటు ఓపెనర్‌గా దిగిన రెన్‌షా 235 బంతులు ఎదుర్కుని 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 128 పరుగులు చేశాడు. టీమిండియాపై వీరిద్దరి మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా లబూషేన్ మిడిలార్డర్‌లో టీమిండియాపై ఎక్కువగా పరుగులు రాబట్టి.. ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టస్మానియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు నష్టపోయి.. 143 పరుగులు చేసింది. ఇంకా 90 పరుగుల వెనుకబడి ఉంది. ఈ పెర్ఫార్మన్స్‌లతో రెన్‌షా.. టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా ODI జట్టు vs భారత్

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా T20I జట్టు vs భారత్(మొదటి రెండు మ్యాచ్‌లు)

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది