Viral Video: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
ఆస్ట్రేలియా ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. భారీ పైథాన్‌లు కావచ్చు.. పెద్ద పెద్ద కంగారూలు కావచ్చు.. అలాగే ఈసారి భారీ సైజు జలచరం మనల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

సముద్ర ప్రపంచంలో ఎన్నో వింతలకు నిలయం. తన గర్భం నిగూడ నిక్షేపాలను దాచిపెట్టుకోవడమే కాకుండా.. ఎన్నో అరుదైన జాతులకు చెందిన జలచరాలను తనలోనే ఉంచుకుంటుంది. అప్పుడప్పుడూ అరుదుగా కనిపించే ఆ జీవులు.. ఇలా జనాలకు కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా తరచూ సరీసృపాలు, జలచరాలు కనిపించి షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇంట్లో ఓ భారీ పాము అకస్మాత్తుగా కనిపించడం లేదా.. భారీ సైజు సాలెపురుగులు ప్రజలపైకి దూకడం.. లేదా కొండచిలువలు, మొసళ్ళు, కంగారూలు.. ఇలా ఒకటేమిటి అన్ని ఉంటాయి. తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియాలో అలాంటి ఓ భారీ జీవి కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పిగ్మీ బ్లూ వేల్ సముద్ర గర్భంలో ఎంచక్కా ఈదుకుంటూ వెళ్తున్నట్టు మీరు చూడవచ్చు. దీనిని జనాలు బస్సెల్టన్ జెట్టీ సమీపంలో చూడగా.. వెంటనే తమ ఫోన్లతో ఆ ఫుటేజ్ రికార్డు చేశారు. చూపరులను మంత్రముగ్దులు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ‘ఓ మై గాడ్!’, ‘ఇట్స్ హ్యుజ్’, ‘ఇట్స్ ఇన్క్రెడిబుల్’ అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. కాగా, పిగ్మీ బ్లూ వేల్స్ ఆకారంలో భారీగా ఉంటాయి. అలాగే సుమారు 24 మీటర్ల(79 అడుగులు) పొడవు వరకు పెరుగుతాయి. వీటిని భూమిపై అతిపెద్ద జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
View this post on Instagram




