AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బుడ్డోడా అలా.. ఎలా మింగేశావ్‌రా.! ఎక్స్‌రే తీయగా కళ్లు తేలేసిన డాక్టర్లు

చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కచ్చితంగా వాళ్లు ఏం చేస్తున్నారో మన చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే చేతికి దొరికినవి మింగేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి వియత్నాంలో చోటు చేసుకుంది. మరి ఆదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Viral: బుడ్డోడా అలా.. ఎలా మింగేశావ్‌రా.! ఎక్స్‌రే తీయగా కళ్లు తేలేసిన డాక్టర్లు
Viral
Ravi Kiran
|

Updated on: Oct 03, 2025 | 12:26 PM

Share

ఓ విచిత్ర కేసు వియత్నాంలో చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడి కడుపు నుంచి గుండె ఆకారంలో ఉన్న అయస్కాంతాన్ని తొలగించారు వైద్యులు. భోజనం తర్వాత ఆడుకుంటుండగా ఆ బాలుడు ప్రమాదవశాత్తు 2 సెంటీమీటర్ల పొడవున్న ఆయస్కాంతాన్ని మింగేశాడు. అదృష్టవశాత్తూ ఆ బాలుడు అయస్కాంతాన్ని మింగడం.. అతడి తల్లిదండ్రులు చూడటంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే తీయగా.. అది సరిగ్గా రోగి పేగుల్లో ఇరుక్కున్నట్టు గమనించారు. అది పేగుల్లో చిల్లులు, నెక్రోసిస్‌కు కారణమయ్యే ఛాన్స్ ఉండటంతో.. వెంటనే ఎండోస్కోపీ ద్వారా ఆయస్కాంతాన్ని తొలగించారు. వియత్నాంలోని విన్‌లాంగ్‌లో ఉన్న జుయెన్ జనరల్ హాస్పిటల్‌లోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

బాలుడికి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఆ సాయంత్రమే అతడ్ని డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది. అక్కడ పని చేసే డాక్టర్ మాట్లాడుతూ.. ‘రోగిని త్వరగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాబట్టి తొందరగా ఆపరేట్ చేయగలిగాం. ఆ వస్తువు పదునైనది కాకపోవడం వల్ల శరీరంలో ఎలాంటి గాయాలు కాలేదు. రక్తస్రావం కూడా జరగలేదు. ఒకవేళ ఎక్కువసేపు ఆ వస్తువు లోపలే ఉన్నట్లయితే.. జీర్ణవ్యవస్థకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

నాణేలు, బటన్ బ్యాటరీలు, అయస్కాంతాలు వంటి చిన్న వస్తువులను మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అందుబాటులో లేకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. తమ బిడ్డ ఏదైనా వస్తువును మింగి ఉండవచ్చని అనుమానించినట్లయితే, తల్లిదండ్రులు వీలైనంత త్వరగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే