- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Actress In Viral Photo, She Is Tamil Heroine Divya Bharathi
Tollywood: అప్పుడు అందంగా లేదన్నారు.. ఇప్పుడు ఆరాధ్య దేవత అంటున్నారు.. ఈ చిన్నది ఎవరంటే
కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అందాలతో సౌత్ ఇండస్ట్రీనే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మతిపోగొట్టేస్తోంది ఈ వయ్యారి. ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా మరి.?
Updated on: Oct 02, 2025 | 1:45 PM

'బ్యాచిలర్' సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ దివ్య భారతి. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి.. తన సహజ నటనకు ప్రశంసలు అందుకుంది. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్‌లతో రెచ్చిపోయిన ఈ భామ.. తొలి చిత్రంతోనే కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది.

కెరీర్ తొలినాళ్ళలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లో నటించిన దివ్యభారతి.. మొదట బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా విపరీతమైన ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఇప్పుడు అందాల అటామ్ బాంబ్‌గా మారింది. ఇన్‌స్టాలో హాట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో 1992, జనవరి 28న జన్మించిన దివ్యభారతి.. ఈరోడ్‌లోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ITలో B.Tech కంప్లీట్ చేసింది. 2015లో ‘మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్’ విజేతగా నిలిచింది.

అలాగే అదే 2015 సంవత్సరంలో, దివ్య భారతి ‘పాపులర్ న్యూ ఫేస్ మోడల్’గా కూడా కిరీటాన్ని పొందింది. ఆ నెక్స్ట్ ‘ప్రిన్సెస్ ఆఫ్ కోయంబత్తూర్ 2016’ టైటిల్‌ను గెలిచింది.

మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దివ్య భారతి సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తోంది. అటు వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది ఈ భామ.




