రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
ఉత్తరప్రదేశ్‌లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తన తల్లిదండ్రులను హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన రూ. 50 కోట్ల బీమా స్కామ్ బయటపడింది. మీరట్‌కు చెందిన 37 ఏళ్ల విశాల్ సింఘాల్ ఒకరికి తెలియకుండా మరొకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
నలుగురి పేరిట బీమా తీసుకున్నాడు. తల్లి పేరిట ఉన్న రూ. 25 లక్షల బీమా కోసం 2017లో ఆమెను హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. 2022లో మొదటి భార్య మృతి చెందగా ఆమె పేరిట ఉన్న రూ. 80 లక్షల బీమా మొత్తాన్ని అందుకున్నాడు విశాల్. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, 1.5 కోట్ల క్లెయిమ్‌లను అందుకున్నాడు. తండ్రి 2024లో గుర్తుతెలియని వాహన ప్రమాదంలో మృతి చెందినట్లు ఎఫ్‌ఐఆర్ క్లోజ్ చేయించాడు. అప్పుడు అతని రెండు అకౌంట్లలోకి రూ. 50 లక్షల రూపాయలు వచ్చి చేరాయి. తండ్రి బీమా సొమ్మును అందుకున్న రోజుల వ్యవధిలో నాలుగు కొత్త వాహనాలు కొనుగోలు చేసాడు. సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను జీవిత బీమా పాలసీలపై సంతకం చేయాలని బలవంత పెట్టాడు. బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై ఒత్తిడి తెస్తున్న విషయాన్ని పోలీసులకు చెప్పింది. ఇంట్లో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసుల్ని అప్రమత్తం చేసింది, దీంతో నాలుగు రోడ్డు ప్రమాద కేసులను రీ ఓపెన్ చేసిన సంభల్ పోలీసులు విస్తుపోయారు. విశాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టారని విశాల్ పోలీసులకు తెలిపాడు. అయితే పోలీసులు అతని మాటలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయ ఫిర్యాదుపై సంభాల్ ఎస్‌పీ చెప్పింది ఏంటంటే.. తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్‌లో ఇది ఒక భాగమేనని… ఇంటిలోని వారిని హత్య చేసిన విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడనీ అన్నారు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు. విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ సింఘాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ఫైట్.. ఫైనల్ లిస్ట్‌లో ఆ నలుగురు
డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు సజీవ దహనం
ఆ 3 జిల్లాలకూ రెడ్ అలర్ట్ !! అత్యంత భారీ వర్షాలు ఎక్కడంటే
Gold Price: దసరా వేళ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే
అల్లు అర్జున్ సినిమాలో సమంత ?? రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

