ఆ 3 జిల్లాలకూ రెడ్ అలర్ట్ !! అత్యంత భారీ వర్షాలు ఎక్కడంటే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఉత్తర వాయువ్యదిశలో కదిలి ఒడిశా- ఉత్తర ఆంధ్ర కోస్తాతీరం సమీపంలో శుక్రవారం తీరాన్ని దాటే అవకాశం ఉంది. గోపాల్‌పూర్-పారాదీప్ తీరంలో ప్రభావం చూపనుంది. దీంతో వారం రోజులపాటు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది విశాఖ వాతావరణ శాఖ. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, యానాంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని IMD హెచ్చరించింది. ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు కూలాయి. జీవీఎంసీ కార్యాలయం వద్ద కారుపై చెట్టు కూలింది. ఈదురుగాలుల బీభత్సంతో ఈస్ట్ పాయింట్ కాలనీలోనూ భారీ వృక్షాలు నేలకొరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతిభారీ వర్షాలతో పాటు.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్, భీమిలి RDO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: దసరా వేళ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే
అల్లు అర్జున్ సినిమాలో సమంత ?? రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం
గాజాలో యుద్ధం మాటున మహిళలపై ఆకృత్యాలు ఎన్నో
రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
విశాఖలో ఈదురుగాలుల బీభత్సం.. కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్‌లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

