రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
రాజమండ్రిలో గోదావరి నది గంటగంటకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, రెండో హెచ్చరికకు నీటి మట్టం చేరువలో ఉంది. 11 లక్షల క్యూసిక్‌లకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాలు నీట మునగడంతో పంటలు, పశుగ్రాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రాజమండ్రిలో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. అధికారులు దిగువకు దాదాపు 11 లక్షల క్యూసిక్‌లకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ చింతూరు నుంచి శబరి నది కూడా పొంగిపొర్లడంతో గోదావరి ఉధృతి పెరిగింది. వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యానవన పంటలు నీట మునిగిపోగా, పశువులకు పశుగ్రాసం దొరకడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టేకేసట్టిపాలెం, అప్పన్నరాముల లంక కాజువేలు కూడా మునిగిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో ఈదురుగాలుల బీభత్సం.. కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్‌లు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

